మొక్కలకీ కాఫీ!

నిద్ర మబ్బు తొలగాలన్నా, తలనొప్పిగా అనిపించినా కప్పు కాఫీ కావాలనిపిస్తుంది కదా! చిటికెలో మెదడును ఉత్తేజితం చేసే ఇది మొక్కలకీ ప్రయోజనకారి. ఎలాగో చదివేయండి.

Updated : 20 Jun 2022 00:49 IST

నిద్ర మబ్బు తొలగాలన్నా, తలనొప్పిగా అనిపించినా కప్పు కాఫీ కావాలనిపిస్తుంది కదా! చిటికెలో మెదడును ఉత్తేజితం చేసే ఇది మొక్కలకీ ప్రయోజనకారి. ఎలాగో చదివేయండి.

కాఫీ పొడిలో నైట్రోజన్‌ ఉంటుంది. ఇది మొక్కలకు మేలు చేస్తుంది. పండ్లు, కూరగాయల తొక్కలు, ఎండిన ఆకులకు కాఫీ పొడిని 4:1 నిష్పత్తిలో చేర్చి కంపోస్ట్‌లా చేసి మొక్కలకు వాడండి. మిగతావాటి పోషకాలతోపాటు దీనిలోని క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌, ఐరన్‌ మొక్క ఆరోగ్యంగా పెరగడంలో సాయం చేస్తాయి.

* తాగగా మిగిలిన దాన్ని మాత్రం మొక్కలకు పోయొద్దు. ఇది కీటకాలు, పురుగులను ఆకర్షించే ప్రమాదముంది. స్పూను కాఫీ పొడిని రెండు కప్పుల మట్టితో కలిపి మొక్కల మొదళ్లలో వేసి, నీటిని పోయండి. వేర్లు కుళ్లడం, ఇతర రోగాల నుంచి రక్షిస్తుంది. అయితే తరచుగా మాత్రం చేయొద్దు. నెల, రెండు నెలలకోసారి చేస్తే చాలు.

* నత్తలు, సాలీళ్లు, మిడతలు వంటివి వేధిస్తున్నా కాఫీతో వాటికి బదులు చెప్పొచ్చు. ఒకటిన్నర కప్పు నీటికి అరకప్పు కాఫీ డికాషన్‌ను కలిపి పిచికారీ చేయండి. ఫలితం ఉంటుంది. అయితే చక్కెర మాత్రం కలపొద్దు, పూర్తిగా చల్లారాకే మొక్కలకు ఉపయోగించాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్