సేదతీరొచ్చు... సంతృప్తి చెందొచ్చు...

ఇంటిని అందంగా సర్దడమనేది ఓ కళ. కొందరు సహజంగానే అందులో నిష్ణాతులైనట్లు చూడముచ్చటగా తీర్చిదిద్దుతారు. అలాంటి నైపుణ్యం మీకు లేదనుకుంటున్నారా.. అవసరమే లేదు.. ఇంటీరియర్‌ డిజైనర్లు సూచిస్తోన్న ఈ చిన్న చిన్న సూత్రాలు పాటిస్తే మీరు కూడా భేషుగ్గా అలంకరించగలరు...

Published : 04 Jul 2022 00:52 IST

ఇంటిని అందంగా సర్దడమనేది ఓ కళ. కొందరు సహజంగానే అందులో నిష్ణాతులైనట్లు చూడముచ్చటగా తీర్చిదిద్దుతారు. అలాంటి నైపుణ్యం మీకు లేదనుకుంటున్నారా.. అవసరమే లేదు.. ఇంటీరియర్‌ డిజైనర్లు సూచిస్తోన్న ఈ చిన్న చిన్న సూత్రాలు పాటిస్తే మీరు కూడా భేషుగ్గా అలంకరించగలరు...

* గోడలకు రంగులద్దితే చాలు ఇల్లు కొత్తగా భాసిస్తుంది కదూ! కానీ తరచుగా రంగులు వేయించాలంటే కష్టం. ఇందుకు ప్రత్యామ్నాయంగా వాల్‌పేపర్లు ఉపయోగించండి. తేలిగ్గా ఇంటికి నయా లుక్‌ తెచ్చినవారవుతారు.

* గోడల రంగులకు తగిన వాల్‌ హ్యాంగింగ్స్‌ ఎంచుకోండి. లేదంటే ఉన్నాయి కాబట్టి తగిలించినట్లు ఉండటమే తప్ప అతికినట్టుగా, ఆకర్షణీయంగా ఉండవు.

* గదుల నిండా సరంజామా పేర్చేస్తే అప్పుడే ఇల్లు మారినట్లుగా ఉంటుంది. అనవసరమైన సామాను కొనడంతో డబ్బు దుబారా చేయడమే కాదు, ఇంటి అందాన్ని చేజేతులా తగ్గించినవారవుతారు.

* మ్యాటెడ్‌ పిక్చర్‌ ఫ్రేమ్స్‌పై మీ కళాత్మకత చూపిస్తూ నైరూప్య చిత్రాలు వేయొచ్చు. చక్కటి రంగుల కలయికలతో మీ ప్రతిభను ప్రదర్శించొచ్చు.

* పిల్లల్ని ఎక్కువగా చదివించినా ఒత్తిడికి గురవుతారు. అలాంటప్పుడు సేదతీరాలంటే ఓ గదిని తనకిష్టమైన రీతిలో సర్దమనండి. ఆ గదిలో నప్పేలా చార్టు మీద బొమ్మ వేసి తగిలించమని లేదా ఏదైనా బొమ్మ తయారుచేసి అమర్చమనండి. ఇలాంటి సవాళ్లతో ఇంటికి శోభ రావడమే కాదు, వారిలో సృజనాత్మకతను వెలికితీసినట్లవుతుంది.

* కొత్తదనం ఉట్టిపడే రెండు మూడు కుర్చీలూ మోడాలూ తీసుకుంటే అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. సోఫాలో కూర్చున్నప్పుడు కాళ్లు చాపుకోవడానికి లేదా ల్యాప్‌టాప్‌ పెట్టుకోవడానికి అనువుగా ఉంటాయి. ఇంటి ముంగిట లేదా బాల్కనీలో వేసుకుని కూర్చున్నా చూడముచ్చటగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్