పాత కొత్తల కదంబం
మంచాలూ, బల్లలూ లాంటివి అందరిళ్లలో ఉండేవే. కాకపోతే వాటిని ఎంచుకోవడంలో ఉంటుంది విభిన్నత, కళాభిరుచి. చిన్నా పెద్దా ప్రతి వస్తువుతోనూ ఇంటికి అందం, ఆకర్షణ వస్తాయి. మీ ఇల్లు ఇంకొంచెం ప్రత్యేకంగా ఉండాలంటే ...
మంచాలూ, బల్లలూ లాంటివి అందరిళ్లలో ఉండేవే. కాకపోతే వాటిని ఎంచుకోవడంలో ఉంటుంది విభిన్నత, కళాభిరుచి. చిన్నా పెద్దా ప్రతి వస్తువుతోనూ ఇంటికి అందం, ఆకర్షణ వస్తాయి. మీ ఇల్లు ఇంకొంచెం ప్రత్యేకంగా ఉండాలంటే ...
* ప్రతి గదిలో ఒక అల్మరను అలంకరణ సామగ్రికి పూర్తిగా వదిలేయండి. అంత వెసులుబాటు లేదంటే కొన్ని వస్తువుల పక్కన అరుదైన బొమ్మలు, కృత్రిమ మొక్కలూ లేదా పూలగుచ్ఛాలు ఉంచండి. పుస్తకాల అరలోనూ మధ్య మధ్యలో ఇలాంటివి అమర్చండి. ఎంత చక్కగా ఉంటాయో!
* తాతల నాటి చెక్క బీరువాలు, ఎత్తుపీటలు, కుర్చీలు, ఫొటో ఫ్రేమ్లు లాంటి వస్తువులు ఉంటే అమ్మేయడమో అటక మీద చేర్చడమో చేయొద్దు. వాటిని వసారా లేదా గదుల్లో ఖాళీ ఉన్న చోట అమర్చి, చుట్టూ గోడలకు కొంగొత్త డిజైన్ ఉన్న వాల్ పేపర్ అతికించండి. ఆ ప్రాచీన, అధునాతనల చేరిక లేదా కలయిక కదంబమాలలా సమ్మోహనంగా ఉంటుంది.
* ఇంటీరియర్ డిజైనర్లు ముక్తకంఠంతో చెప్పే మాట... ‘తగ్గింపు’. వంటింటి నుంచి ముందు హాలు వరకూ ఎక్కడా అనవసర వస్తువులను పేర్చకండి. అవసరం అని కొన్నప్పటికీ వాడకపోతే మట్టుకు వాటిని నిర్మొహమాటంగా, నిరభ్యంతరంగా వదిలించేసుకోండి. అమ్మేస్తారా, ఇచ్చేస్తారా, పడేస్తారా- అనేది మీ ఇష్టం.
* రంగుల ప్రాధాన్యతను గుర్తించండి. ప్రతి రంగులోనూ అందం, ఆహ్లాదం ఉంటుంది. కాకపోతే ఏది ఎక్కడ అతుకుతుంది, ఏ టెక్శ్చర్కు నప్పుతుందో గ్రహించాలి.
* చాలామంది స్నానాల గది దగ్గర పొదుపు చేస్తుంటారు. ఓ గదిలోనో, వసారాలోనో కొంచెం స్థలం తక్కువైనా ఫరవాలేదు స్నానాల గది కాస్త విశాలంగా ఉండేలా కట్టించుకోండి. అద్దె ఇల్లయితే ఇంటితోబాటు దాన్ని కూడా ముందే పరిశీలించండి. ఆ గది గోడలను కూడా చిత్రపటాలతో ముస్తాబు చేయండి.
* ఇంటి లోపల ముస్తాబుతోబాటు ముంగిట్లో వీలైనన్ని మొక్కలు పెంచండి. ఆ సహజ సౌందర్యానికి మరేదీ సాటి రాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!