టాజిల్స్‌తో ఇల్లంతా కొత్తగా...
చూడటానికి సింపుల్‌గా ఉండే టాజిల్స్‌తో ఇంటి అందాన్ని రెట్టింపు చేయొచ్చు. అదెలాగంటే...కర్టెన్లు, డైనింగ్టేబుల్పై వేసే కవర్లు, సోఫా కవర్లు, తలగడ చివర్లలో టాజిల్స్ను కలిపితే కొత్తదనాన్ని
చూడటానికి సింపుల్‌గా ఉండే టాజిల్స్‌తో ఇంటి అందాన్ని రెట్టింపు చేయొచ్చు. అదెలాగంటే...
కర్టెన్లు, డైనింగ్టేబుల్పై వేసే కవర్లు, సోఫా కవర్లు, తలగడ చివర్లలో టాజిల్స్ను కలిపితే కొత్తదనాన్ని తెచ్చిపెడతాయి. లేత వర్ణాల కర్టెన్లకు ముదురు వర్ణాల దారాలను ఎంపిక చేసుకోవాలి. వీటితో ఇంట్లోనే టాజిల్స్ను తయారు చేసుకోవచ్చు. ముందుగా గది గోడలకు తగిన వర్ణంలో కర్టెన్లు ఉండేలా చూస్తే చాలు. గుమ్మానికి రెండు భాగాలుగా వేసే కర్టెన్లకు పక్కల, పైన, కింద భాగాల్లో మొత్తం నాలుగువైపుల వచ్చేలా టాజిల్స్ను అటాచ్ చేయాలి. చూడచక్కగా ఇవి గది అందాన్ని రెట్టింపు చేస్తాయి.
భోజనాల బల్లకు..
ఈ టేబుల్‌పై వేసే వస్త్రాన్ని లేతవర్ణంలో నిలువు గీతలుండేలా తీసుకోవాలి. వీటి చివర్లలో టేబుల్ క్లాత్‌పై ఉన్న గీతల వర్ణాల దారాలతో టాజిల్స్ చేసి అతికిస్తే చాలు. ఆ బల్లపై తాజా పూల వాజ్నుంచితే డైనింగ్‌రూం మరింత కళగా కనిపిస్తుంది. కుర్చీ కవర్లకూ ఇలాగే అలంకరిస్తే మొత్తం డైనింగ్ టేబుల్ సెట్ కొత్తగా అనిపిస్తుంది.
హాల్లో..
సోఫా కవర్లను ఎంచుకునేటప్పుడు ముదురు వర్ణాలకే పెద్దపీట వేయాలి. మృదువైన వస్త్రాన్ని ఎంచుకుంటే సోఫాపై ప్రత్యేకంగా కనిపించడమే కాకుండా సౌకర్యంగానూ ఉంటుంది. వీటికి చివర్లలో అతికించే టాజిల్స్ను ఎరుపు, పసుపు, నీలం వర్ణాల దారాలతో చేసినవిగా ఉంటే చాలు. సోఫాలో వేసే దిండ్ల కవర్లకు కూడా మ్యాచింగ్‌గా వేసే ముందుగది ప్రత్యేకంగా కనిపిస్తుంది.
పడకగదికి..
మంచంపై దుప్పట్లకు చివర్లలో ముదురువర్ణాల దారాలతో చేసే టాజిల్స్ పడకగదికే ప్రత్యేకతనిస్తాయి. అలాగే దిండ్లు, కిటికీ కర్టెన్లనూ గది గోడలకు తగినట్లుగా వర్ణాలను ఎంపిక చేసి, వాటికి ఇదే రీతిలో టాజిల్స్ను ఏర్పాటు చేస్తే చాలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!