బాల్కనీ సిట్‌ఔట్‌గా...

ఇల్లు శోభాయమానంగా ఉండాలంటే బోల్డంత డబ్బు కుమ్మరించాలిగా అనుకుంటారు కొందరు. నిజానికి కళా హృదయానికి ధనంతో నిమిత్తం లేదు. శ్రద్ధాసక్తులుంటే ఉన్న వస్తువులతోనే అందంగా తీర్చిదిద్దొచ్చు అంటారు ఇంటీరియర్‌ డిజైనర్లు. ఇక ఈ సూచనలు కూడా తోడైతే మీ పని మరింత సులువవుతుంది...

Published : 25 Jul 2022 00:34 IST

ఇల్లు శోభాయమానంగా ఉండాలంటే బోల్డంత డబ్బు కుమ్మరించాలిగా అనుకుంటారు కొందరు. నిజానికి కళా హృదయానికి ధనంతో నిమిత్తం లేదు. శ్రద్ధాసక్తులుంటే ఉన్న వస్తువులతోనే అందంగా తీర్చిదిద్దొచ్చు అంటారు ఇంటీరియర్‌ డిజైనర్లు. ఇక ఈ సూచనలు కూడా తోడైతే మీ పని మరింత సులువవుతుంది...

* మన పుస్తకాలన్నిటినీ అరల్లో సైజుల వారీగా సర్దేస్తాం సరే! మరి టీపాయ్‌ మీదో, సోఫాలోనో పక్కగా పెట్టే పుస్తకాల సంగతేంటి?! అవి గజిబిజిగా ఉండకూడదంటే పేముకర్రతోనో (కేన్‌), ఇనుప చువ్వలతోనో రూపొందించిన కాడబుట్టలో అమర్చండి. అందంగా కనిపిస్తాయి, అడ్డు అనిపించవు. దాని పక్కన పాతకాలపు రాగి పాత్ర లాంటి డెకొరేటివ్‌ పీస్‌ను ఉంచితే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

* పాత్రలూ ఇతర సరంజామాను క్రమ పద్ధతిలో సరుకుంటే వంటిల్లు ఇరుకనిపించదు. దానికి తోడు కొత్తిమీర, మెంతికూర, అల్లం లాంటి కొన్ని మొక్కల కుండీలను కిటికీకి దగ్గరగా గట్టు మీద పెట్టి చూడండి. అందానికి అందం, వంటకాల్లోనూ ఉపయోగపడతాయి.

* ఇంట్లో రెండు బాల్కనీలు ఉంటే ఒకదాన్ని గ్లాసుతో మూసేసి అక్కడ కుర్చీలూ టీపాయ్‌ అమర్చండి. గోడలను పెయింటింగులు లేదా వాల్‌ హ్యాంగింగ్స్‌తో అలంకరించండి. బయటి మొక్కలూ, ఆకాశమూ కనిపిస్తూ ఉల్లాసంగా ఉంటుంది. గ్లాసు ఉన్నందున దుమ్మూధూళీ రాదు. వచ్చిన బంధుమిత్రులూ అక్కడ కూర్చుని కబుర్లు చెబుతూ ఆనందిస్తారు. వద్దనుకున్నప్పుడు కర్టెన్‌తో మూసేయొచ్చు.

* సోఫాలూ, కుషన్లూ, కార్పెట్టూ గోడ రంగుకు మ్యాచ్‌ అయితేనే అందం. లేదంటే ఒకదానికొకటి అతకనట్టుగా ఉంటాయి.

* బల్లలూ బీరువాలూ లాంటి పెద్ద వస్తువులను అడ్డు లేకుండా, తేలిగ్గా ఉపయోగించుకునేలా ఏర్పాటు చేసుకోండి. కుర్చీలూ లేదా సోఫాలు హాలు మధ్యలో కంటే గోడ పక్కగా అమర్చడం మేలు. దాని వల్ల స్థలం మిగులుతుంది. అతిథులు వచ్చినపుడు విశాలంగా, వెసులుబాటుగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్