ఒద్దికగా సర్దేయొచ్చు...
హాలు, వంటగది, పడకగదుల్లో సామానెక్కువగా ఉంటే ఇరుకుగా అనిపిస్తాయి. అన్నీ అవసరమైనవే, నిత్యం వినియోగించాల్సినవి ఉన్నప్పుడు వాటిని ఒకేచోట ఒద్దికగా సర్దేయొచ్చు అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం.మూతలు..
హాలు, వంటగది, పడకగదుల్లో సామానెక్కువగా ఉంటే ఇరుకుగా అనిపిస్తాయి. అన్నీ అవసరమైనవే, నిత్యం వినియోగించాల్సినవి ఉన్నప్పుడు వాటిని ఒకేచోట ఒద్దికగా సర్దేయొచ్చు అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం.
మూతలు..
కూరలు, సాంబారు, రసం , ఆమ్లెట్ వేసే ప్యాన్లకు దాదాపు అన్నింటికీ గాజుతో చేసిన మూతలే వస్తాయి. వీటిని ఒకేచోట ఉంచితే ప్రమాదం. అలాగని ప్యాన్స్పై ఉంచడం సరికాదు. వీటిని భద్రపరిచే అలమరలో తలుపు లోపలివైపు చిన్న స్టాండును వాలుగా అమర్చుకోవాలి. ఇందులో సైజులవారీగా మూతలనుంచితే అవసరమైనప్పుడు తీసి వినియోగించుకొని, తర్వాత శుభ్రపరిచి ఇందులో సర్దేయొచ్చు. సౌకర్యంగా ఉంటుంది. పగులుతాయనే భయమూ ఉండదు. అలాగే గిన్నెలపై ఉంచే మూతలను ఉంచడానికి చిన్నగా ఓపెన్ అలమరగా చేసి వంటింటి గట్టుపై మూలగా అమర్చుకుంటే చాలు. ఇందులో వరుసగా మూతలన్నింటినీ సర్దేయొచ్చు.
స్టవ్ పక్కగా..
స్టవ్ దిమ్మెకు పక్కగా చిన్న చిన్న హ్యాంగర్లను అమర్చుకుంటే వాటికి టీ వడకట్టేది, క్యారెట్, బీట్రూట్ తురుముకునేది, అట్లకాడ, గరిటెలు, కత్తులు వంటివన్నీ వేలాడదీసుకోవచ్చు. దీంతో వీటికంటూ ప్రత్యేక స్థానం అవసరం ఉండదు. అత్యవసరానికి చేతికి అందేలా ఉంటాయి. శుభ్రం చేసి అక్కడే వేలాడదీస్తే సౌకర్యంగానూ ఉంటుంది. దీంతోపాటు ప్యాన్లను వరుసగా సైజులవారీ సర్దాలంటే ఒకదాంట్లో మరొకటి ఉంచకుండా, అలమరలో చెక్క కింది భాగంలో చిన్నచిన్న రింగ్స్ ఏర్పాటు చేసుకుంటే చాలు. వీటికి వరుసగా అన్నింటినీ తగిలించేయొచ్చు. అదే అలమరలో మరికొన్ని విడి గిన్నెలను ఉంచడానికి చోటు కూడా ఉంటుంది.
సింక్పై
గిన్నెలు శుభ్రం చేసే సింక్కు పైన వచ్చేలా ఇప్పుడు రకరకాల స్టాండులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఒక స్టాండును అమర్చుకుంటే శుభ్రపరిచిన డిన్నర్ ప్లేట్స్, చెంచాలు వంటివన్నీ అందులో ఉంచేయొచ్చు. వాటినుంచి కారే నీళ్లు సింక్లో పడతాయి. వంటిల్లు తడిగా అవ్వదు. అలాగే వాషింగ్ పౌడర్, వాష్రూం శుభ్రపరిచే లిక్విడ్స్, సబ్బులు వంటివన్నీ ఒకేచోట ఉంచితే వెతుక్కోకుండా తీసుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
- గోటితోనే పోదు మరి!
- కొత్తందాల క్రాప్ టాప్
ఆరోగ్యమస్తు
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
- మీ స్కోరెంత?
- ఇంటిలోనే వ్యాయామం...
అనుబంధం
- చాటింగ్ చూసి నమ్మలేకపోయా...!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
- పాప వల్ల నాతో ఆ సంతోషం ఉండట్లేదంటున్నారు..!
యూత్ కార్నర్
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
- తెల్లజుట్టు... కారణమేంటి?
'స్వీట్' హోం
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
- చిన్నారుల చిత్రకళా ప్రదర్శన..!
- అద్దమూ మెరవాలిగా..!
- దుమ్ము బాధ పోవాలంటే..!
వర్క్ & లైఫ్
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
- ఆఫీసులో ఇలా చేస్తున్నారా?
- అయితే... నేలపై పడుకోండి!