ఆన్‌లైన్‌లో కొంటున్నారా?

లాక్‌డౌన్‌ మనకు అలవాటు చేసిన వాటిల్లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఒకటి. అసలే శ్రావణమాసం. కొత్తవస్త్రాలు, ఇంట్లోకి అంటూ బోలెడు కొనాలి. దీనికితోడు ఆకర్షించే ఆఫర్లు. చకచకా కార్ట్‌లోకి కొట్టేస్తున్నారా?

Updated : 01 Aug 2022 09:03 IST

లాక్‌డౌన్‌ మనకు అలవాటు చేసిన వాటిల్లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఒకటి. అసలే శ్రావణమాసం. కొత్తవస్త్రాలు, ఇంట్లోకి అంటూ బోలెడు కొనాలి. దీనికితోడు ఆకర్షించే ఆఫర్లు. చకచకా కార్ట్‌లోకి కొట్టేస్తున్నారా?

ఏం తోచకపోయినా, మనసు బాలేకపోయినా మనలో ఎక్కువ మందికి ఆలోచన షాపింగ్‌ వైపే పోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. భిన్న రంగులు, నిర్ణయం మన చేతిలో ఉంటుంది కదా.. దీంతో ఒత్తిడి దూరమవడమే కాక ఆనందంగానూ అనిపిస్తుంది. ఆన్‌లైన్‌ అయితే తిరగడం, మోసే ఇబ్బందీ లేకపోవడంతో ఇంట్లోనే కూర్చొని షాపింగ్‌ చేసేస్తున్నాం. భారీ తగ్గింపూ ఆకర్షించే మార్గమే.. అవకాశం మించి పోతుందని కార్ట్‌లోకి కొట్టేస్తుంటాం. మరి బడ్జెట్‌ సంగతో?

* కాబట్టి.. డబ్బులు చెల్లించే ముందు ‘ఇది నిజంగా అవసరమా?’ అని ఆలోచించుకోండి. కాదనుకోండి పక్కన పెట్టేయండి. సేవ్‌ ఫర్‌ లేటర్‌ కొట్టారనుకోండి.. తర్వాతెప్పుడైనా కొనుక్కోవచ్చు.

* తక్కువకు వస్తోంది కదాని చాలావరకూ కొనేస్తుంటాం. తీరా.. అది త్వరగా పాడవడమో, అంతగా నచ్చడం లేదని పక్కన పడేయడమో చేస్తుంటాం. అదీ వృథానే కదా! డిస్కౌంట్లను కాక నాణ్యత, రివ్యూలు వంటివి పరిశీలించుకుంటే ఆ సమస్య ఉండదు.

* షాపింగ్‌ మొదలుపెట్టే ముందే బడ్జెట్‌ ఇంత అని నిర్ణయించుకోండి. దాన్ని ఓ కాగితం మీద పెద్ద అక్షరాలతో రాసుకుని ఎదురుగా ఉంచుకోండి. అలాగే అనుకున్న దానికి రూపాయి ఎక్కువ అయినా కొనకూడదు అని ముందే నిర్ణయించుకోండి. తెలియకుండానే కొత్తవి వెదుకుతూ వెళుతుంటాం కదా.. దానికి బ్రేక్‌ పడుతుంది. ఆచితూచీ కొంటాం. ఇక ఖర్చు పెరిగే అవకాశమేది?

* కార్డు వివరాలను సేవ్‌ చేసి ఉంచుతున్నారా? అలా చేయకండి. భద్రతా సమస్య ఒక్కటే కాదు.. ఇది తెలియకుండానే ఎక్కువ ఖర్చు చేసే మార్గం. కార్డు సేవ్‌ చేసి లేదనుకోండి.. దాని నంబరుతోపాటు చెల్లించాల్సిన మొత్తాన్నీ ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుంటామట. అప్పుడు కూడా ఆలోచన మారొచ్చు. అదే సేవ్‌ చేసి ఉందనుకోండి. టకటకా నొక్కేసుకుంటూ వెళ్లిపోతాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్