తాంబూలానికి జత చేసి..
శ్రావణం మనకు అత్యంత ప్రియమైన మాసం. అందులోనూ వరలక్ష్మి వ్రతాన్ని ఆనందంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటాం. సాయంకాలం ముత్తైదువులకు తాంబూలమివ్వడంతో పూర్తయ్యే ఈ విధికి కొందరు చిన్ని బహుమతుల్నీ జోడిస్తున్నారు. మీరూ అదే ఆలోచనలో ఉన్నారా? ఇవి ఉపయోగపడతాయేమో చూడండి.
శ్రావణం మనకు అత్యంత ప్రియమైన మాసం. అందులోనూ వరలక్ష్మి వ్రతాన్ని ఆనందంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటాం. సాయంకాలం ముత్తైదువులకు తాంబూలమివ్వడంతో పూర్తయ్యే ఈ విధికి కొందరు చిన్ని బహుమతుల్నీ జోడిస్తున్నారు. మీరూ అదే ఆలోచనలో ఉన్నారా? ఇవి ఉపయోగపడతాయేమో చూడండి.
* పసుపు, కుంకుమ, జాకెటు ముక్క, తాంబూలం ఇవన్నీ ఒక కవరులో పెట్టి ఇస్తుంటాం కదా! బదులుగా పోట్లీలో పెట్టివ్వండి. సంప్రదాయంగా కనిపిస్తుండటంతోపాటు వేడుకల సమయంలో పట్టుకోవడానికీ సులువుగా ఉంటుందిది. వస్త్రాలతో చేసిన వీటితో పర్యావరణ హిత గిఫ్ట్ ఇచ్చినట్టూ ఉంటుంది. చిన్న జ్యూట్ బ్యాగులను ఎంచుకున్నా మంచిదే.
* తాంబూలాలన్నింటినీ మన ప్లేటులో అమర్చుకొని ఒక్కొక్కరికీ చేతికి అందిస్తుంటాం కదా! ఈసారి ఫైబర్, సిలికాన్తో చేసిన ప్లేట్లలో పెట్టివ్వండి. బోలెడు డిజైన్లలో దొరుకుతాయి. చూడటానికీ ముచ్చట, తీసుకున్న వాళ్లకీ ఆ వస్తువు ఉపయోగపడుతుంది.
* తెలుగు లోగిళ్లలో కామధేనువు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదంగా భావిస్తుంటాం. కంచు, ఇత్తడి లోహాల్లో, పింగాణీ రూపంలోనూ ఆవూదూడ బొమ్మలు దొరుకుతుంటాయి. వాటినీ ఇవ్వొచ్చు. స్టీలు, జర్మన్ సిల్వర్తో చేసిన లక్ష్మి, గణపతి కాయిన్లు లభిస్తాయి. వాటినైనా ఎంచుకోవచ్చు.
* ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ మొక్కలు తప్పనిసరి అయ్యాయి. పెయింటింగ్ వేసిన చిన్న చిన్న మట్టి కుండీలు దొరుకుతున్నాయి. వాటిని ఇవ్వండి.. ఒక మొక్క పెంచడానికి మీరు కారణమవుతారు. భిన్న రూపాల్లో ఉన్నవి ఎంచుకుంటే షోకేసులో పెట్టుకునే వస్తువుగానూ మారిపోతుంది.
* రోజువారీ పనులతో ఎంత ఒత్తిడో మనకు కాక ఇంకెవరి తెలుసు? దాన్ని దూరం చేయడానికీ ఈ సందర్భాన్ని వాడుకోవచ్చు. ఎలాగంటారా.. డిఫ్యూజర్ రూపంలో! వాటిని ఇచ్చేయండి. ఆ సువాసనలు మీ స్నేహితుల ఒత్తిడిని దూరం చేస్తాయి.
* జర్మన్ సిల్వర్తో చేసిన పూలు, కుంకుమ భరిణి, సింధూరం స్టిక్, చిన్న గాజుల పెట్టెలు.. బోలెడున్నాయి. వీటికి ఖర్చూ పెద్దగా అవ్వట్లేదు. మీ వ్రతానికి టైమున్నా సొంతంగా ఎంచుకుని సిద్ధం చేసుకోవడం ఇబ్బందంటే.. ఆర్డర్ మీద చేసిచ్చే సంస్థలూ ఉన్నాయి. ప్రయత్నించి చూడండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!