స్టడీ టేబుల్ కోసం...
ఇంట్లో చదువుకోవడం కోసం ప్రత్యేకంగా గది లేకపోతే, స్టడీ టేబుల్‌ను ఇలాక్కూడా సర్దుకోవచ్చు అంటున్నారు ఇంటీరియర్ నిపుణులు.చతురస్రాకారం లేదా దీర్ఘచతురస్రాకారంలో సొరుగులున్న
ఇంట్లో చదువుకోవడం కోసం ప్రత్యేకంగా గది లేకపోతే, స్టడీ టేబుల్‌ను ఇలాక్కూడా సర్దుకోవచ్చు అంటున్నారు ఇంటీరియర్ నిపుణులు.
చతురస్రాకారం లేదా దీర్ఘచతురస్రాకారంలో సొరుగులున్న ఒక బల్ల, దానికి సరిపోయేలా ఓ కుర్చీ ఉంటే చాలు. వీటితో స్టడీ ఏరియాను ఏర్పాటు చేసుకోవచ్చు. హాల్ లేదా బెడ్రూంలో ఉన్న కిటికీ పక్కగా ఈ బల్లనుంచాలి. కిటికీ బయటివైపు మొక్కలుంచిన తొట్టెలను సర్దాలి. బల్లపై ఓవైపు రెండు మూడు ఇండోర్ ప్లాంట్స్ ఉన్న గాజు సీసాలుంచాలి. రెండో వైపు హ్యాంగింగ్ ప్లాంట్‌ను సర్దాలి. టేబుల్‌పై ల్యాప్‌టాప్, పుస్తకాలకు చోటుంచాలి. కుర్చీలో ముదురు వర్ణం కవరు వేసిన కుషన్ దిండునుంచితే చాలు. ఆ ప్రాంతం స్టడీ రూంగా మారిపోతుంది. ఆహ్లాదకరమైన ఆ వాతావరణం ఏకాగ్రతనూ తెచ్చిపెడుతుంది.
చిన్నారుల కోసం..
వీరి పడకగది మూలగా గోడకు రంధ్రాలతో ఉన్న రెడీమేడ్ కార్డ్బోర్డును ఏర్పాటు చేయాలి. దీనికి నీలం, ఊదా వంటి ముదురువర్ణాన్ని వేయాలి. దీనికి పెన్సిళ్లు, రబ్బరు, పెన్నులు, కత్తెర, స్కేలు వంటి వస్తువులన్నీ వేసి తగిలించే బౌల్స్ అమర్చాలి. అవసరమైనప్పుడు తీసి వినియోగించుకొని తిరిగి అందులోనే సర్దేలా పిల్లలకు అలవాటు చేయాలి. గోడకు చిన్న బల్లను అతికించి, ముందు చిన్న కుర్చీ వేయాలి. టేబుల్‌పై స్టడీ ల్యాంపు, చిన్న ఇండోర్ మొక్కనుంచితే చాలు. స్టడీ టేబుల్ సిద్ధమైనట్లే. కార్డ్‌బోర్డు అంచులపైన అలంకరణగా సీరియల్ లైట్స్ వైరును అటాచ్ చేస్తే ఆ ప్రాంతం మరింత ఆకర్షణీయంగా మారుతుంది.
కాంతివంతంగా..
ముందుగదికి కిటికీ సౌకర్యం లేకపోయినా స్టడీ టేబుల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. గదిలో సర్దిన ఫర్నిచర్‌లోని కుర్చీ ఎత్తుకు సరిపోయేలా టేబుల్ తీసుకుంటే మంచిది. అవసరమైనప్పుడు ఆ కుర్చీని వినియోగించి తిరిగి సోఫా దగ్గర సర్దేయొచ్చు. అలాగే టేబుల్‌ను గోడకు ఆనేట్లు వేయాలి. పక్కగా చిన్నస్టాండు అమర్చుకోవాలి. టేబుల్‌పై సర్దుకోలేని వాటిని ఈ స్టాండులో ఉంచుకోవచ్చు. బల్లకు పక్కగా కాస్త పెద్దగా కనిపించే ఇండోర్‌ప్లాంట్ తొట్టెను సర్ది, ఓ లైట్‌ను ఏర్పాటు చేస్తే చాలు. ఆ ప్రాంతం వెలుతురుతో నిండిపోతుంది. గోడకు పిల్లలు గీసిన రెండు మూడు బొమ్మలను ఫ్రేంలు కట్టించి తగిలిస్తే, అక్కడ చదువుకోవడానికి పిల్లలు ఉత్సాహపడతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!