సౌకర్యాన్ని అందించే ఫ్లోర్ సోఫా..
ఒకే ఫర్నిచర్ భిన్న రకాలుగా ఉపయోగపడాలి.. ఈ తరహా డెకార్‌కి ఈమధ్య ప్రాధాన్యం పెరిగింది. ఆ కోవలోకే వస్తుందీ ఫ్లోర్ సోఫా.. ఇంట్లో ఏ గదికైనా నప్పేస్తుంది.
ఒకే ఫర్నిచర్ భిన్న రకాలుగా ఉపయోగపడాలి.. ఈ తరహా డెకార్‌కి ఈమధ్య ప్రాధాన్యం పెరిగింది. ఆ కోవలోకే వస్తుందీ ఫ్లోర్ సోఫా.. ఇంట్లో ఏ గదికైనా నప్పేస్తుంది.
* ముందుగదిలో కిటికీ పక్కగా ఫ్లోర్‌సోఫా గదికి ప్రత్యేక అందాన్ని తెస్తుంది. పనయ్యాక కాళ్లు చాపుకొని సాగిలపడి కూర్చొంటే హాయిగా అనిపిస్తుంది. ఇంకా ఖాళీ సమయాల్లో టీవీ చూడటానికి లేదా అందరూ సరదాగా కాఫీ తాగడానికీ ఇది చాలా అనుకూలం. కిటికీకి వేసే పరదాల వర్ణంలోనే కుషన్స్ కవర్లుండేలా చూసుకుంటే చూడచక్కగా ఉంటాయి. కిటికీ నుంచి వచ్చే వెలుతురు, దీని పక్కగా చిన్న బల్లపై ఉంచే ఇండోర్ మొక్కలు ఫ్లోర్‌సోఫాను ఆకర్షణీయంగా కనబడేలా చేస్తాయి.
* చిన్న బెడ్ అవసరం ఉన్నవారూ దీన్ని ఎంచుకోవచ్చు. పొడవైన, లేదా చతురస్రాకారంలో ఉండే కుషన్స్ సర్ది వాటికి పూలడిజైన్ల ప్రింట్‌లున్న కవర్లను గది గోడలకు సరిపోయేలా ఎంచుకుంటే చాలు. కూర్చోడానికే కాదు, పుస్తకం చదువుకోవడానికీ, నిద్రపోవడానికీ కూడా పనికొస్తుంది.
* బాల్కనీలో మొక్కల పక్కగా పొడవుగా ఉండేలా ఫ్లోర్ సోఫాను అమర్చుకుంటే సాయంత్రం సమయాల్లో కూర్చుని విశ్రాంతి తీసుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. సరదాగా ఇంటిల్లిపాది ఒకేచోట కాసేపు కూర్చోవడానికి అనువుగా ఉంటుంది. దీనిపై రెండుమూడు కుషన్లు, వీటికి ముదురు వర్ణాల్లో ఎంబ్రాయిడరీ చేసిన కవర్లతోపాటు, ఈ సోఫా వెనుకవైపు గోడకు చిత్రలేఖనాలు, డ్రైఫ్లవర్స్‌ను అందంగా సర్దితే చాలు. మీ బాల్కనీ కొత్తగా మారిపోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.