చిన్ని పాదాలు వేసేయండిలా!

శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు కన్నయ్యను ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా పాదాల ముద్రలు వేసి మురిసిపోతాం. పిల్లలుంటే పిండిలో వాళ్ల పాదాలు ముంచి అడుగులు వేయిస్తుంటాం. చిన్న పిల్లలు లేని వాళ్లు ఇలా ప్రయత్నించవచ్చు...

Published : 19 Aug 2022 00:53 IST

శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు కన్నయ్యను ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా పాదాల ముద్రలు వేసి మురిసిపోతాం. పిల్లలుంటే పిండిలో వాళ్ల పాదాలు ముంచి అడుగులు వేయిస్తుంటాం. చిన్న పిల్లలు లేని వాళ్లు ఇలా ప్రయత్నించవచ్చు...

* ఓ చిన్న త్రిభుజాన్ని గీయండి. దాన్ని ఆనుకొని కింద ఒక వృత్తం గీయండి. వాటిని పిండితో నింపి లోపల తిరిగి చిన్న త్రిభుజం, వృత్తం ఏర్పడేలా వేలితో ఫొటోలో చూపిన విధంగా గీయండి. త్రిభుజానికి పైన ఐదు చిన్న చుక్కల్ని పెడితే సరి. పక్కనే ఇంకోటి గీస్తే పాదాలు సిద్ధం.

* చిన్న త్రిభుజం గీసి, పిండితో నింపి, దానిపైన అవుట్‌లైన్‌ వచ్చేలా త్రిభుజం గీయాలి. పైన వేళ్లను పెట్టుకుంటే సరిపోతుంది.

* ఎనిమిది గీసి, లోపల పిండితో నింపి, పై వృత్తమ్మీద చుక్కల్ని పెట్టినా పాదాలు సిద్ధం.

* ఆంగ్ల అక్షరం ‘ఎస్‌’ గీసి రెండు కొనల్ని లోపలికి మెలితిప్పి పైన పాదాల వేళ్ల కోసం చుక్కలుగా పెట్టుకోవాలి. పక్కన ఎస్‌ అక్షరాన్ని తిరగేసినట్లుగా గీసి ఇలాగే చుక్కలు పెట్టుకుంటే సరిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్