వజ్రాల నగలు.. జర భద్రం
అతి ఘాటైన రసాయనాలతో చేసిన పరిమళద్రవ్యాలు, సన్‌స్క్రీన్ లోషన్, హెయిర్‌స్ప్రే వంటివి వినియోగించినప్పుడు వీటి ప్రభావం వజ్రాల నగలపై పడి అవి కాంతిని కోల్పోయే ప్రమాదం ఉంది. బయటికి వెళ్లేటప్పుడు డ్రెస్సింగ్, మేకప్, పెర్ఫ్యూమ్, హెయిర్‌స్ప్రే వంటివి పూర్తయిన తర్వాత మాత్రమే వజ్రాల నగలను ధరించాలి. దాంతో రసాయనాల ప్రభావం వీటిపై తక్కువగా ఉంటుంది.
సాధారణంగా ఆభరణాలంటే ఎంతో మనసుపడి కొనుక్కుంటాం. మరి వజ్రాభరణాలైతే మరీ అపురూపం కదా! అందుకే వీటి పరిరక్షణ, శుభ్రతలో ప్రత్యేక శ్రద్ధ వహించాలంటున్నారు నిపుణులు.
అతి ఘాటైన రసాయనాలతో చేసిన పరిమళద్రవ్యాలు, సన్‌స్క్రీన్ లోషన్, హెయిర్‌స్ప్రే వంటివి వినియోగించినప్పుడు వీటి ప్రభావం వజ్రాల నగలపై పడి అవి కాంతిని కోల్పోయే ప్రమాదం ఉంది. బయటికి వెళ్లేటప్పుడు డ్రెస్సింగ్, మేకప్, పెర్ఫ్యూమ్, హెయిర్‌స్ప్రే వంటివి పూర్తయిన తర్వాత మాత్రమే వజ్రాల నగలను ధరించాలి. దాంతో రసాయనాల ప్రభావం వీటిపై తక్కువగా ఉంటుంది. ఈ నగలను ధరించాలనుకున్నప్పుడు గాఢత తక్కువగా ఉండే క్రీంలు, పరిమళద్రవ్యాలు వినియోగిస్తే మరీ మంచిది. నగల మెరుపు తగ్గదు. వజ్రాల నగలను వేసుకొనేటప్పుడు వేరే బంగారం, రాళ్లు పొదిగిన ఆభరణాలను కలపకుండా ఉండాలి. లేదంటే వాటి రాపిడి వజ్రాలపై పడుతుంది. వీలైనంతగా ఈ హారాన్ని సింగిల్‌గా ధరిస్తేనే ఆ వజ్రాల మెరుపు మరింత కాంతులీనుతుంది.
శుభ్రం చేస్తే..
వజ్రపుటుంగరాన్ని వేలి నుంచి మృదువుగా తీయాలి. అప్పుడే వజ్రం ఉన్న వైపు ఒత్తిడి తగ్గుతుంది. బయటకు వెళ్లి వచ్చిన వెంటనే హారాన్ని తీసి విడిగా ఓ పొడివస్త్రంపై ఉంచి గాలికి ఆరనివ్వాలి. ఆ తర్వాతే భద్రపరచాలి. ఈ ఆభరణాలు కాంతి తగ్గినట్లు అనిపించినప్పుడు గోరువెచ్చని సబ్బు నీటిలో ముంచిన టూత్‌బ్రష్‌తో మృదువుగా రుద్దాలి. ఆ తర్వాత సాధారణ నీటిలో ముంచి మృదువైన వస్త్రంతో ఒత్తితే చాలు. మురికి దూరమై మెరుపులీనుతాయి. అంతేకాదు, ఆరు నెలలకొకసారి నగను కొనుగోలు చేసిన దుకాణదారుడి వద్ద క్లీనింగ్‌కు ఇవ్వడం మంచిది. నగలో పొదిగిన వజ్రాలు బిగుతుగా ఉన్నాయా లేదా అన్నదీ పరిశీలించుకోవాలి.
భద్రపరిచి..
వజ్రాల నగలను వేరే రాళ్లు పొదిగిన లేదా మెటల్‌తో తయారైన నగలతో కలిపి భద్రపరచకూడదు. ఎటువంటి నగలతోనూ కలపకుండా, ప్రత్యేక బాక్సులో ఉంచాలి. అలాగే మృదువైన వస్త్రంతో తయారుచేసిన పౌచ్లోనూ ఈ ఆభరణాలను భద్రపరచొచ్చు. వీటిని ఉంచిన బాక్సు లేదా పౌచ్‌ను పొడిగా, చల్లగా ఉండే ప్రాంతంలో ఉంచడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- అతను తగినవాడేనా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!