కొంచెం తెలివి.. ఇంకొంచెం ఓపిక
వంటావార్పూ ఒక ఎత్తయితే ఇల్లు సర్దుకోవడం ఇంకో ఎత్తు. నిజం చెప్పాలంటే వంటను సులువు చేసే సదుపాయాలున్నాయి. ఇంటిని తీర్చిదిద్దడంలో అలాంటి పద్ధతులు లేవు. కొంచెం తెలివి, ఇంకొంచెం ఓపిక ఉండాలంతే! ఇంటీరియర్ డిజైనర్లు సూచిస్తోన్న ఈ సూత్రాలు పాటించి ఇంటిని అందంగా ముస్తాబు చేయండి...
వంటావార్పూ ఒక ఎత్తయితే ఇల్లు సర్దుకోవడం ఇంకో ఎత్తు. నిజం చెప్పాలంటే వంటను సులువు చేసే సదుపాయాలున్నాయి. ఇంటిని తీర్చిదిద్దడంలో అలాంటి పద్ధతులు లేవు. కొంచెం తెలివి, ఇంకొంచెం ఓపిక ఉండాలంతే! ఇంటీరియర్ డిజైనర్లు సూచిస్తోన్న ఈ సూత్రాలు పాటించి ఇంటిని అందంగా ముస్తాబు చేయండి...
* పిల్లలకు ఎన్నో దుస్తులు, బొమ్మలు ఉంటాయి. కానీ వాళ్లు ఇంకా కావాలని పేచీ పెడుతూనే ఉంటారు. దానికి పరిష్కారమే ‘వన్ ఇన్.. వన్ అవుట్’ రూల్. అంటే ఇంకో బొమ్మ లేదా మరో జీన్స్ కొన్నప్పుడు పాతదాన్ని దానం చేసేయడం. దీని వల్ల అవసరం ఉన్న చిన్నారులకు అవి చేరడమే కాదు, మీ ఇంట్లో ఖాళీ ఏర్పడుతుంది. ఎన్నో దేశాల్లో దీన్ని అమలుపరుస్తున్నారు. మీరూ పాటించండి.
* చాయ్గిన్నె, కూర ప్యాన్లు.. ఇలా కాడ ఉన్న గిన్నెలు సౌకర్యంగా ఉంటాయి. చెయ్యి కాలకుండా ఎంచక్కా వంట చేయొచ్చు. కానీ అవి ఒకదాంట్లో ఒకటి చొప్పున అమరనందున అరల్లో సర్దేందుకు స్థలం సరిపోదు. ఈ సమస్యను నివారించేందుకు కబోర్డ్స్‌కు పక్కన, కొక్కేలకు వేలాడదీయండి. అడ్డుగా ఉండవు. తీసుకోవడం సులువవుతుంది.
* డ్రెసింగ్ టేబుల్ పక్కన హెయిర్ స్టేషన్ పేరుతో ఒక బాక్స్‌ను, దాని పైన మ్యాగ్నెటిక్ స్ట్రిప్‌ను అమర్చండి. దువ్వెనలు, హెయిర్ డ్రయర్, క్లిప్పులు, రబ్బర్బ్యాండుల లాంటివన్నీ అందులో పెట్టేయొచ్చు. కత్తెర, నెయిల్ కటర్, పిన్నులు లాంటివి అయస్కాంతానికి అతికించేస్తే సమయానికి వెతుక్కోకుండా దొరుకుతాయి.
* బాత్రూంలో బాడీ క్లీనింగ్ బ్రష్, ఫేస్‌వాష్ లాంటివి ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నారా? గోడకు దగ్గరగా ఒక రాడ్ ఏర్పాటు చేసుకుంటే.. హ్యాంగింగ్ క్లిప్పుల సాయంతో అలాంటివి తగిలించేయొచ్చు.
* విడదీసి బిగించే చిన్న చిన్న బొమ్మలంటే పిల్లలకు మహా ఇష్టం. అయితే వాటిని ఇల్లంతా పరిచి ఆడటం, ఆనక వాటిల్లో కొన్ని భాగాలు దొరకక మళ్లీ కొనిపించడం మామూలే. ఇలాంటి ఇబ్బంది లేకుండా ఆ ఆటల కోసం ఒక పల్చటి దుప్పటి కేటాయించండి. దానిమీదే ఆడుకోమని చెప్పండి. ఆట పూర్తయ్యాక దాన్ని మూట కట్టేసి అటక మీద పెట్టేస్తే సరిపోతుంది.
* యోగా మ్యాట్ ఎక్కడ పెట్టాలన్నా అడ్డుగా అనిపిస్తుంది. దీనికి పరిష్కారంగా షెల్ఫ్ కింద రెండు చువ్వలు ఏర్పాటు చేశారంటే వాటిమీద పెట్టేయొచ్చు. చూడటానికీ నీట్‌గా ఉంటుంది, తీసుకోవడమూ సులువు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
ఆరోగ్యమస్తు
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
అనుబంధం
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- గోవర్ధనాల గుబాళింపు!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!