పూజ గది సిద్ధమా?

రేపే వినాయక చవితి.  పూజ గది, సామగ్రి ముందే శుభ్రం చేసుకొని ఉంటే మరుసటి రోజు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. అందుకు సాయపడే చిట్కాలివీ! ఫొటో, వెండి, రాగి, ఇత్తడి వస్తువులు, ప్రతిమలూ పూజా మందిరంలో సాధారణంగా కనిపిస్తుంటాయి. ఇత్తడి వస్తువులను నిమ్మచెక్కతో రుద్ది చూడండి మరీ మొండివైతే ...

Published : 30 Aug 2022 00:43 IST

రేపే వినాయక చవితి.  పూజ గది, సామగ్రి ముందే శుభ్రం చేసుకొని ఉంటే మరుసటి రోజు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. అందుకు సాయపడే చిట్కాలివీ!

ఫొటో, వెండి, రాగి, ఇత్తడి వస్తువులు, ప్రతిమలూ పూజా మందిరంలో సాధారణంగా కనిపిస్తుంటాయి. ఇత్తడి వస్తువులను నిమ్మచెక్కతో రుద్ది చూడండి మరీ మొండివైతే నిమ్మరసంలో బేకింగ్‌ సోడా కలిపి వాటికి పట్టించి, పదినిమిషాలాగి కడిగి, పొడి వస్త్రంతో తుడిస్తే మెరుస్తాయి.

నిమ్మచెక్క మీద ఉప్పు చల్లి రాగి వస్తువులను రుద్ది, కడిగితే తేలిగ్గా శుభ్రమవుతాయి. ఉప్పు, వెనిగర్‌ సమాన మోతాదుల్లో తీసుకొని బ్రష్‌తో రుద్దినా సరే. మొండి మరకలైతే ఒక పాత్రలో వస్తువులు మునిగేలా నీరు పోసి దానిలో మూడేసి టేబుల్‌ స్పూన్ల చొప్పున వెనిగర్‌, ఉప్పు వేసి మరిగిస్తే చాలు.

వెండి వాటికి సాధారణ తెల్లటి టూత్‌పేస్ట్‌ పట్టించి కొద్దిసేపు వదిలేసి, ఆపై కడిగేయొచ్చు. గాజు పాత్రలో నీళ్లు, అల్యూమినియం ఫాయిల్‌, బేకింగ్‌సోడా వేసి, మరుగుతున్న నీటిలో ఈ వస్తువుల్ని వేసినా కొత్తవాటిలా మారతాయి.

పూజా మందిరాలన్నింటికీ దాదాపుగా చెక్కతో చేసిన తలుపులే ఉంటాయి. వాటికున్న చిన్న రంధ్రాల్లో దుమ్ము చేరిందా? ఆలివ్‌ నూనెకు నిమ్మరసం కలిపి స్ప్రే బాటిల్‌లో పోయండి. దాన్ని స్ప్రే చేసి వస్త్రంతో తుడిస్తే   శుభ్రపడటమే కాదు.. మెరుస్తుంది కూడా..

ఫొటోఫ్రేమ్‌లకు మసి, జిడ్డు రెండు సమస్యలుంటాయి. వీటిని గ్లాస్‌ స్ప్రేని చల్లి వస్త్రంతోనో, వెట్‌వైప్‌తోనో తుడిస్తే సరిపోతుంది. మందిరం చెక్కదైతే కప్పు నీటిలో పావు కప్పు వెనిగర్‌, టేబుల్‌ స్పూను చొప్పున ఉప్పు, బేకింగ్‌ సోడా కలిపి తుడిస్తే మసి, నూనె మరకలు పోతాయి. మార్బుల్‌ వాటికి వేడినీటిలో డిటర్జెంట్‌ కలిపి తుడిస్తే సరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్