ఎంపికెలా ?
దివాన్, సోఫా, కుర్చీ ఏదైనా.. చిన్న చిన్న కుషన్లు ఉంచడం సాధారణం. అయితే ఇవి కేవలం ఆసరాకేనా? అబ్బే... కాదు... అందానికి కూడా! మరి వాటి ఎంపికలో ఏం గమనించుకోవాలంటే...
దివాన్, సోఫా, కుర్చీ ఏదైనా.. చిన్న చిన్న కుషన్లు ఉంచడం సాధారణం. అయితే ఇవి కేవలం ఆసరాకేనా? అబ్బే... కాదు... అందానికి కూడా! మరి వాటి ఎంపికలో ఏం గమనించుకోవాలంటే...
* కుషన్ మెత్తగా ఉండటంతో సరిపోదు. పైకి అందంగానూ కనిపించాలి. కాబట్టి, ఆ కవర్లను జాగ్రత్తగా ఎంచుకోవాలి. కాటన్, పాలిస్టర్, లెదర్.. ఇలా భిన్న మెటీరియళ్లలో దొరుకుతున్నాయివి. ఎక్కువ కాలం మన్నాలంటే కాటన్‌వీ, తక్కువ నిర్వహణకు పాలియస్టర్‌వీ ఎంచుకోవచ్చు. రిచ్ లుక్ కావాలంటే లెదర్ తప్పనిసరి. అయితే దీనికి ఎక్కువ నిర్వహణ అవసరం. కాబట్టి, ఇవన్నీ సరి చూసుకొని ఆ తర్వాతే ఎంపిక చేసుకోవాలి. యాంటీ డస్ట్‌వి ఎంచుకుంటే పదే పదే మార్చాల్సిన అవసరం ఉండదు.
* పండగలు, వేడుకల్లో ఇంటి అందాన్ని పెంచడంలో వీటిదీ ప్రధాన పాత్రే. కాబట్టి, రోజువారివి కాస్త సాధారణంగా ఉన్నా ఫర్లేదు. ఇందుకు ప్రింటెడ్, తక్కువ ఎంబ్రాయిడరీవి ఎంచుకోవచ్చు. ఇక సంప్రదాయబద్ధంగా కనిపించేవి, నల్లరంగులో ఉన్నవైతే పూల డిజైన్లు, హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్‌వి నప్పుతాయి. ఆధునిక వాటికి భిన్న ఆకారాలు, లేత రంగులవి బాగుంటాయి. పూసలు, చంకీలు, రాళ్లు ఉన్నవి త్వరగా ఊడిపోతుంటాయి. వాటి నిర్వహణా కష్టమే! ఎవరూ తాకరు, కేవలం చూడటానికే అనుకున్నప్పుడే ఇలాంటివి ఎంచుకోవాలి.
* ఇంటీరియర్‌కు తగ్గవి తీసుకుంటే మంచిది. అలాగే అన్నీ ఒకే సైజులో ఉండాలన్న నిబంధనా లేదు. భిన్న సైజుల వాటిని ఒకచోట చేర్చి చూడండి. కొత్త లుక్ వస్తుంది. అన్నింటికీ ఒకే రంగు ఉండాలన్న నియమం ఏమీ లేదు. ముదురు, లేత రంగుల మేళవింపుగా అమర్చినా చూడటానికి బాగుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.