ఆన్‌లైన్‌లో షూ కొంటున్నారా?

షాపింగ్‌ అంటే చాలామందికిప్పుడు ఆన్‌లైనే! పాదరక్షల విషయంలో ఒకసారి సైజు దొరక్కపోతే మరోసారి సౌకర్యంగా అనిపించవు. తిరిగిచ్చేయడమో, పక్కన పడేయడమో చేయాలి. సమయం, డబ్బు

Published : 12 Sep 2022 00:25 IST

షాపింగ్‌ అంటే చాలామందికిప్పుడు ఆన్‌లైనే! పాదరక్షల విషయంలో ఒకసారి సైజు దొరక్కపోతే మరోసారి సౌకర్యంగా అనిపించవు. తిరిగిచ్చేయడమో, పక్కన పడేయడమో చేయాలి. సమయం, డబ్బు వృథా. అలాకాకూడదంటే..

* దుస్తులనుకోండి.. పెద్దగా అయితే కుట్లు వేయించుకోవచ్చు. పాదరక్షలకు ఆ వెసులుబాటు ఉండదు. సంస్థనుబట్టి సైజుల్లో మార్పులుంటాయి. పెద్దగయ్యాయో ఊసూరుమంటూ తిరిగిచ్చేయాల్సిందే! అందుకే సైజు నంబర్‌ను బట్టి కాక.. ఇంచుల్లో లేదా సెం.మీ. చూసి కొనడం అలవాటు చేసుకోండి. ఇందుకోసం ఒక అట్టముక్కను తీసుకోండి. దానిపై మీ పాదాన్నుంచి, ముందు, వెనక పెన్నుతో గుర్తు పెట్టుకోండి. స్కేలుతో ఎన్ని సెం.మీ. ఉందో కొలవండి. వెబ్‌సైట్‌లో నచ్చిన చెప్పులు కొనేముందు సైజ్‌ చార్ట్‌ను పరిశీలించుకుంటే సరిగ్గా సరిపోయేవి కొనుక్కోవచ్చు.

* సైజు దొరికిందనో, చూడ్డానికి బాగున్నాయనో కొనేయొద్దు. రివ్యూ, రేటింగ్‌లను చదవాలి. తక్కువ రేటింగ్‌ ఉన్నా, బాలేవన్నా రిస్క్‌ తీసుకోకండి. వెబ్‌సైట్‌ కూడా నమ్మదగినదేనా అని చెక్‌ చేసుకోవాలి. కొత్తదాంట్లో ప్రయత్నించే ముందూ దాన్ని గురించి సమాచారం ఎక్కడైనా దొరుకుతుందేమో వెదకండి. నమ్మకం కలిగాకే దానిలో సొమ్ము చెల్లించండి.

* మనకు సరిపడని, సౌకర్యంగా లేనివాటిని తిరిగిచ్చేస్తుంటాం. కొన్నిసార్లు ఆ వీలు లేదన్న మెసేజ్‌ వస్తుంది గమనించారా? వాళ్లు తిరిగి తీసుకోకపోతే డబ్బు వృథానే కదా! దీన్నీ ముందే చెక్‌ చేసుకోవాలి. ఇప్పుడెన్నో చిన్న సంస్థలూ ఆన్‌లైన్‌ బాట పట్టాయి. సంస్థ నమ్మకమైనదైనా.. పటిష్టమైన భద్రత ఉండకపోవచ్చు. అసలే ఎన్నో ఇంటర్నెట్‌ మోసాలను చూస్తున్నాం. ఖాతా వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కొద్దంటే ‘క్యాష్‌ ఆన్‌ డెలివరీ’ ఆప్షన్‌ను ఎంచుకోవడం మేలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని