కుండీల్లో.. ఔషధాలు

మొక్కలు లేకపోతే మనుగడే లేదు. పంటలన్నీ పల్లెల్లో రైతులు పండించినా పూలూ కూరగాయల్లాంటివి మనం పెంచుకుంటే ఎరువుల్లేని ఆహారం తిన్నట్టూ అవుతుంది, పర్యావరణాన్ని పరిరక్షించినట్టూ

Published : 16 Sep 2022 00:27 IST

మొక్కలు లేకపోతే మనుగడే లేదు. పంటలన్నీ పల్లెల్లో రైతులు పండించినా పూలూ కూరగాయల్లాంటివి మనం పెంచుకుంటే ఎరువుల్లేని ఆహారం తిన్నట్టూ అవుతుంది, పర్యావరణాన్ని పరిరక్షించినట్టూ అవుతుంది. ముఖ్యంగా నిత్యజీవితంలో మనల్ని కాపాడే ఔషధ మొక్కలు అనేకం ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని ఇళ్లల్లో పెంచేయొచ్చు. ఎరువులూ, పోషణా అవసరం లేని అలాంటి మొక్కల్ని నాటుదాం, ఆనందంగా జీవిద్దాం.

పుదీనా: ఆకలిని పుట్టిస్తుంది. అజీర్తిని, ఇన్‌ఫ్లమేషన్ని, వాంతులు, వికారం, అలర్జీలను తగ్గిస్తుంది. శరీరంలో చేరిన బ్యాక్టీరియాను నశింపచేస్తుంది. డయేరియా బారి నుంచి రక్షిస్తుంది. కూర, ఫ్రైడ్‌రైస్‌, కిచిడీ.. ఎందులో వేసినా ఆహా అనిపిస్తుంది. పుదీనా చట్నీ చేస్తే పిల్లలూ పెద్దలూ మహా ఇష్టంగా తినేస్తారు. ఆకు కోసేసిన కాడలను మట్టిలో పాతితే చాలు.. ఎంచక్కా చిగురించి పుదీనా వనాలు తయారవుతాయి.


లెమన్‌ గ్రాస్‌:
అజీర్తి, అల్సర్లు, అధిక రక్తపోటు, డయేరియా లేదా మలబద్ధకం, గుండెలో మంట, గ్యాస్ట్రిక్‌ సమస్య, పంటినొప్పి, వికారం, వాంతులు, వణుకు, కీళ్ల నొప్పులు, గొంతునొప్పి.. వరసబెట్టి జబ్బుల పేర్లు ఏకరువు పెడుతున్నారేంటీ.. అనుకుంటున్నారా! వాటన్నిటినీ నివారించే అద్భుత ఔషధమొక్క లెమన్‌ గ్రాస్‌. పేరుకు తగ్గట్టు పచ్చగడ్డిని తలపించేలా ఉంటుంది. నేలమీద కానీ కుండీలో కానీ సునాయాసంగా పెంచేయొచ్చు.


మెంతి: శక్తిని పెంపొందిస్తుంది. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. విరేచనాలను అరికడుతుంది. శరీరంలో పేరుకున్న మలినాలు, దోషాలను తొలగిస్తుంది. కురులకు దృఢత్వాన్నిస్తుంది. మధుమేహాన్ని తగ్గిస్తుంది. హార్మోన్‌ లెవెల్స్‌ను సమంగా ఉంచుతుంది. క్యాన్సర్‌ను నివారిస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న మెంతి పెంపకంలో చిన్నమెత్తు కష్టం లేదు. కొన్ని గింజలు చల్లితే చాలు ఇట్టే మొలకలొచ్చేస్తాయి. రోజూ కాసిని నీళ్లు పోయడం తప్ప అదనపు శ్రమ ఏమీ ఉండదు. మెంతి ఆకూ, గింజలూ రెండూ ఔషధప్రాయమే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్