గది గోడలపై చెట్లు..

గుబురుగా పెరిగిన చెట్టు, విరబూసిన పూలు, కొమ్మలపై పక్షులు... వాటి కిలకిల రావాలు.. ఇవన్నీ హాల్‌ లేదా పడకగదిలో కనిపిస్తే ప్రకృతి మన చెంతకు వచ్చినట్లే. ఈ ట్రీ డిజైన్‌ ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది. 

Published : 28 Sep 2022 01:04 IST

గుబురుగా పెరిగిన చెట్టు, విరబూసిన పూలు, కొమ్మలపై పక్షులు... వాటి కిలకిల రావాలు.. ఇవన్నీ హాల్‌ లేదా పడకగదిలో కనిపిస్తే ప్రకృతి మన చెంతకు వచ్చినట్లే. ఈ ట్రీ డిజైన్‌ ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది.

గోడలపై అందంగా అమరుతున్న ఈ చెట్లు గదుల అందాన్ని పెంచుతున్నాయి. వీటికి తగినట్టుగా దుప్పట్లు, కిటికీ కర్టెన్లు మ్యాచింగ్‌గా వేస్తే చాలు. అందమైన తోటలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు అనిపించడం ఖాయం. అక్రిలిక్‌ పెయింట్స్‌, సృజనాత్మకత ఉంటే చాలు గోడను అందమైన కాన్వాస్‌గా మార్చేయొచ్చు.

చిన్నారులకు..

మహావృక్షం, దాని మొదట్లో లేదా కొమ్మలపై విశ్రాంతి తీసుకుంటున్న పులులు, సింహాలు వంటి వన్య ప్రాణులు చిన్నారుల గదికి ప్రత్యేకంగా నిలుస్తాయి. గోడపై నుంచి సీలింగ్‌ వరకు పాకే వృక్షం చిన్నారుల గదికి కొత్త అందాన్ని తెస్తుంది. పక్కగా పుస్తకాల అలమర లేదా కథ]ల పుస్తకాలు, ఆటబొమ్మలు సర్దితే చాలు. పిల్లల గది ముచ్చటగా ఉంటుంది. డ్రాయింగ్‌ రూంలో చిన్న చెట్టును తీర్చిదిద్ది, దానికి కొమ్మలుగా అనిపించేలా చిన్నచిన్న చెక్కలు గోడకు అతికించాలి. వాటిపై కుటుంబ సభ్యుల ఫొటోలు, అందమైన ఫ్రేములు వంటివి సర్దితే, అవి చెట్టుకొమ్మలపై ఉన్నట్లు అనుభూతిని తెస్తాయి. గది ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇంటిమధ్యలోని పిల్లర్‌ను కాండంలా తీర్చిదిద్ది దానికి ఫొటోఫ్రేములు సర్దినా చాలు. నిజమైన వృక్షం ఇంటి మధ్య ఉన్నట్లు అనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని