కాఫీకి వాటిని చేరిస్తే..

కాఫీ శరీరానికి మేలని ఒకరంటే లేదు చేటంటారు మరొకరు. అందరికంటే ఉదయాలు ముందే ప్రారంభమయ్యేది మనకే. పనులు వేగంగా అవ్వాలంటే కాఫీ పడక తప్పదు. మరెలా? వీటిని కాఫీకి చేర్చేయండి.. ఆరోగ్యంతోపాటు అదనపు ప్రయోజనాలు అంటున్నారు నిపుణులు. దాల్చినచెక్క.. సినమమ్‌ టీ చాలా మందికి పరిచయమే! ఈ పొడిని కాస్త కాఫీకీ కలిపి చూడండి

Published : 01 Oct 2022 00:24 IST

కాఫీ శరీరానికి మేలని ఒకరంటే లేదు చేటంటారు మరొకరు. అందరికంటే ఉదయాలు ముందే ప్రారంభమయ్యేది మనకే. పనులు వేగంగా అవ్వాలంటే కాఫీ పడక తప్పదు. మరెలా? వీటిని కాఫీకి చేర్చేయండి.. ఆరోగ్యంతోపాటు అదనపు ప్రయోజనాలు అంటున్నారు నిపుణులు.

దాల్చినచెక్క.. సినమమ్‌ టీ చాలా మందికి పరిచయమే! ఈ పొడిని కాస్త కాఫీకీ కలిపి చూడండి. నిద్రలేమి కారణంగా అలసట ఏర్పడుతుంది కదా! అది మటు మాయమవుతుంది. దీనిలో ఎక్కువ మోతాదులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ రోగ నిరోధకతను పెంచుతాయి. చెడు కొలెస్టరాల్‌, ఇన్‌ఫ్లమేషన్‌నూ దరిచేరనీయవు.

యాలకులు.. నెలసరికి ముందు, ఆ సమయంలో తలనొప్పి, వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. కాఫీలో యాలకుల పొడి కలుపుకొని తాగండి. ఈ సమస్యలు తగ్గుతాయి. దీనిలోని మినరల్స్‌ రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. నోటి దుర్వాసననే కాదు.. ఒత్తిడినీ దూరం చేస్తాయి.

లవంగాలు.. కప్పు కాఫీకి పావు చెంచా లవంగపొడిని కలుపుకొని తాగండి. దీనిలో మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలం. దీనిలోని యుగెనాల్‌ ఒత్తిడి, కొన్నిరకాల క్యాన్సర్లను దూరం చేస్తుంది. గర్భధారణ అవకాశాలనూ పెంచుతుంది.

జాజికాయ.. విటమిన్‌ బి6, ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్‌ లాంటి ఎన్నో దీని ద్వారా లభిస్తాయి. ఈ పొడిని కాఫీకి కలిపి చూడండి. అనీమియా దూరమవుతుంది. జీర్ణ సమస్యలుండవు. ఒత్తిడి తగ్గి నాణ్యమైన నిద్ర పడుతుంది.

అల్లం.. సీజన్లవారీ ఇన్ఫెక్షన్లు దూరం చేయడంలో ఇది ముందుంటుంది. అల్లం చిన్న ముక్కలు లేదా శొంఠి పొడి.. నచ్చిన రీతిలో కలుపుకొని తాగండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని