పండక్కి.. సిద్ధమా?
పండగంటే ఆనందం కంటే పనే ఎక్కువ. రేపే దసరా! ఇల్లు సర్దడం, డెకరేషన్.. చాలా మిగిలున్నాయంటూ హైరానా పడుతున్నారా? ఈ చిట్కాలు పాటించేయండి.
పండగంటే ఆనందం కంటే పనే ఎక్కువ. రేపే దసరా! ఇల్లు సర్దడం, డెకరేషన్.. చాలా మిగిలున్నాయంటూ హైరానా పడుతున్నారా? ఈ చిట్కాలు పాటించేయండి.
* వేడుకేదైనా ఇంటి శుభ్రత తప్పనిసరి. ఇప్పుడు లోతైన శుభ్రత వైపు వెళ్లకండి. కనిపించే దుమ్ము దులపడం, వస్తువులను సరైన స్థానాల్లో ఉంచడం, ఇల్లు తుడవడం వరకే పరిమితమైతే సరి. సోఫా కవర్లు, దుప్పట్లు మార్చేయండి. లుక్ మారిపోతుంది.
* దివాన్, సోఫాల్లో దిండ్లకు ముదురు రంగుల్లో కవర్లను వేయండి. గోడలకి పువ్వులు, రంగు రంగుల చున్నీలను వేలాడదీస్తే పండగ కళ వచ్చేస్తుంది. అక్కడక్కడా మొక్కల కుండీలను ఉంచితే ఆకట్టుకుంటాయి.
* పండగలంటేనే పిండి వంటలు. ఏం చేయాలన్నది ముందే నిర్ణయించేసుకోండి. వాటికి అవసరమైనవీ సిద్ధం చేసుకుని ఉంటే మరుసటి రోజు పని సులువు. పూజ సామాగ్రి చెక్ చేసుకోవడం, లేనివి తెప్పించుకోవడం, పూజ గది అలంకరణ వంటివీ ఈరోజే చూసుకుంటే మచిది.
* మనం మాటలు, పనిలో పడితే పిల్లలకు బోర్ కొట్టదూ! అందుకే మన పనిలో అడ్డు పడుతుంటారు. వాళ్ల కోసం స్వీట్లు, చిన్న ఆటలు వంటివి ప్లాన్ చేసుకుంటే మనల్ని పూజ వగైరా ప్రశాంతంగా చేసుకోనిస్తారు. వాళ్లూ హాయిగా ఆడుకుంటారు. రంగుల కాగితాలు, క్లే వంటివి ఇచ్చి నచ్చిన బొమ్మలు చేయమంటే సరి. వాటిని అక్కడక్కడా ఇంట్లో అంటిస్తే.. అదో అందం కూడా.
* వేడుకల వేళ నలుగురూ ఒకచోట చేరడం మామూలే. కొన్నిసార్లు అనుకోకుండా అతిథులు వస్తుంటారు. దానికీ సిద్ధమైపోండి. తక్కువ సమయంలో స్నాక్స్, వంట పూర్తిచేసేలా ప్యూరీలు, కూరగాయల ముక్కలు వంటివి సిద్ధం చేసుకొని ఉంటే హడావుడి పడాల్సిన పనుండదు. లేదూ ఇప్పుడు రెడీ టూ కుక్ బోలెడు దొరుకుతున్నాయి. వాటిని తెచ్చి ఉంచుకున్నా సరే! మిగిలిపోతాయన్న కంగారూ అవసరం లేదు. తర్వాతా చక్కగా వాడుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.