ధాకీ దరువుకి.. ధునుచునీ అడుగులు!

దేశమంతా దసరా వేడుకలు ఒకెత్తయితే... కోల్‌కతాలో మరొకెత్తు. ఇక్కడి స్త్రీలు శక్తి ప్రదాయిని అయిన దుర్గామాతను పూజించడమే కాదు... ఆ స్ఫూర్తిని అందుకోవడంలోనూ ముందుంటారు. మహిళా సాధికారతే లక్ష్యంగా... కోల్‌కతాలో ఈ సారి దుర్గాపూజలని ‘బంగ జనని’ అనే థీమ్‌తో నిర్వహించారు. ఈ సారి కార్యక్రమాల్లో లింగవివక్షని తోసిపుచ్చి..

Published : 05 Oct 2022 00:38 IST

దేశమంతా దసరా వేడుకలు ఒకెత్తయితే... కోల్‌కతాలో మరొకెత్తు. ఇక్కడి స్త్రీలు శక్తి ప్రదాయిని అయిన దుర్గామాతను పూజించడమే కాదు... ఆ స్ఫూర్తిని అందుకోవడంలోనూ ముందుంటారు. మహిళా సాధికారతే లక్ష్యంగా... కోల్‌కతాలో ఈ సారి దుర్గాపూజలని ‘బంగ జనని’ అనే థీమ్‌తో నిర్వహించారు. ఈ సారి కార్యక్రమాల్లో లింగవివక్షని తోసిపుచ్చి.. పూజా కార్యక్రమాలని దత్తాత్రేయఘోషల్‌ ఆధ్వర్యంలో మహిళా పూజారులు నిర్వహించారు. అలాగే ఈ సమయంలో ధాక్‌ వాద్యాన్ని వాయిస్తారు. పెద్దపెద్ద డ్రమ్ముల మాదిరిగా ఉండే ధాక్‌ని వాయించడంతోనే ఈ పూజల హడావిడి మొదలవుతుంది. సాధారణంగా మగవాళ్లు మాత్రమే వీటిని వాయిస్తారు. ఇందుకు విరుద్ధంగా ఈసారి ప్రధానపూజా మండపాల్లో స్త్రీలు వాయించి శభాష్‌ అనిపించుకున్నారు. గత ఐదు ఏళ్లుగా వీళ్లు ఈ వాద్యంలో ప్రతిభ కనబరుస్తున్నా.. ఈసారి పొరుగు రాష్ట్రాలైన అసోం, ఒడిశాలకు కూడా వెళ్లి శభాష్‌ అనిపించుకున్నారు. రెండు చేతులతో, నోటితో నిప్పుల పాత్రను పట్టుకుని అందులో ధూపం వేసి, ధాక్‌ దరువుకి అనుగుణంగా చేసే నాట్యాన్ని ధునుచునీ అంటారు. ఈ నాట్యాన్ని కూడా ఈసారి అమ్మవారి ముందు తామే చేసి సాధికారితను చాటుకున్నారు వంగ మహిళలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని