వైరు బుట్టలు.. మళ్లీ వస్తున్నాయ్‌!

అలా అలా ఓ ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన ఇంట్లో ఇప్పటిలా రకరకాల ప్లాస్టిక్‌ సంచులు, బ్యాగులు ఉండేవి కావు. వైరు బుట్టలుండేవి.

Published : 12 Oct 2022 00:33 IST

అలా అలా ఓ ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన ఇంట్లో ఇప్పటిలా రకరకాల ప్లాస్టిక్‌ సంచులు, బ్యాగులు ఉండేవి కావు. వైరు బుట్టలుండేవి. పిల్లలు స్కూల్‌కి క్యారేజీ తీసుకెళ్లాలన్నా, మగవాళ్లు మార్కెట్‌కి వెళ్లాలన్నా ఈ వైరుబుట్టలే వినియోగించేవారు. మధ్యలో వాడిపారేసే ప్లాస్టిక్‌ సంచులు వచ్చాక వీటి వాడకం నెమ్మదిగా తగ్గింది. ఇప్పుడు మళ్లీ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం రావడంతో ఈ వైరు బుట్టలకు డిమాండ్‌ పెరుగుతోంది. గతంతో పోలిస్తే ఆకర్షణీయమైన రంగుల్లో రావడంతోపాటు... ఇరవైఏళ్లపాటు వాడుకోదగ్గ బుట్టలు కావడంతో మళ్లీ వీటికి ఆదరణ పెరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్