మన్నికగా ఉండాలంటే... మరిచిపోవద్దు ఇవి!

అమ్మాయిల ఆభరణాల్లో చాలా కాలం క్రితమే...హ్యాండ్‌బ్యాగూ చేరిపోయింది. ఆఫీసుకైనా, పార్టీకైనా, పర్యటనకి వెళ్లినా అది వెంట ఉండాల్సిందే. అయితే...ఎంత ఖరీదుది కొన్నా...దాన్ని సరిగా వాడకపోతే, ఆకృతిని కోల్పోతుంది. మన్నికా తగ్గుతుంది.

Published : 15 Oct 2022 00:50 IST

అమ్మాయిల ఆభరణాల్లో చాలా కాలం క్రితమే...హ్యాండ్‌బ్యాగూ చేరిపోయింది. ఆఫీసుకైనా, పార్టీకైనా, పర్యటనకి వెళ్లినా అది వెంట ఉండాల్సిందే. అయితే...ఎంత ఖరీదుది కొన్నా...దాన్ని సరిగా వాడకపోతే, ఆకృతిని కోల్పోతుంది. మన్నికా తగ్గుతుంది. మరేం చేయాలంటే...

కనిపించిన వస్తువునల్లా బ్యాగులో వేసి నింపేయడం వల్ల సమయానికి ఒక్క వస్తువూ దొరకదు. పైగా అన్నీ కలిసిపోయి చిందరవందరగా మారిపోతాయి. అందుకే వేటికవి విడిగా పెట్టుకుంటే తీసుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు. అందుకోసం జిప్‌లాక్‌ కవర్లను ఎంచుకోవచ్చు. అంటే ఉదాహరణకు చిల్లరకి ఓ చిన్న పర్సు, మందులకు ఓ కవరూ ఇలా అన్నమాట.

హ్యాండు బ్యాగుల్లో తేలికపాటి వస్తువులే పెట్టాలి. లేదంటే...అవి ఆకృతి మారిపోయి త్వరగా పాడవుతాయి. చిరుతిళ్ల కవర్లనూ తెరిచి బ్యాగుల్లో పెట్టేస్తారు కొందరు. వీలైనంతవరకూ ఆహార పదార్థాలూ, మూతలు ఒలికే వాటికి రక్షణగా కవర్లు పెట్టడం మరిచిపోవద్దు. లేదంటే ఇతర వస్తువులూ పాడవుతాయి.

ఇప్పుడు హ్యాండ్‌ బ్యాగులే...ఎక్కువ అరలతో కొత్తగా వస్తున్నాయి. స్మార్ట్‌ రకాలూ ఉండనే ఉన్నాయి. ఇయర్‌పాడ్స్‌, ఇయర్‌ఫోన్స్‌, ఇతరత్రా కేబుళ్లూ, ఛార్జర్లు చుట్టేసుకోకుండా ఉండటానికి కేబుల్‌ ఆర్గనైజర్లు దొరుకుతున్నాయి. ఇలాంటివి ఎంచుకుంటే అవసరమైనప్పుడు వాడుకోవచ్చు లేదంటే కేబుల్‌ని చుట్టేయొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్