నిమ్మ వాసనలు... నచ్చేస్తాయిలా! ..

ఒక్కోసారి చిన్న చిన్న చిట్కాలే... పెద్ద చిక్కుల్ని సైతం దూరం చేస్తాయి. అలాంటి బోలెడు ప్రయోజనాలు నిమ్మకాయలో ఉన్నాయి. దాన్ని ఎలా వాడాలో తెలుసుకుందామా! దోమలు అరికట్టేందుకు వాడే రిపల్లెంట్ల వాసన కొందరికి పడదు. అలాంటి వారు నిమ్మరసం తొక్కల్ని మరిగించి, అందులో కాస్త లవంగం నూనె కూడా చేర్చి గది మూలల్లో స్ప్రే చేస్తే సరి.

Published : 24 Oct 2022 00:32 IST

ఒక్కోసారి చిన్న చిన్న చిట్కాలే... పెద్ద చిక్కుల్ని సైతం దూరం చేస్తాయి. అలాంటి బోలెడు ప్రయోజనాలు నిమ్మకాయలో ఉన్నాయి. దాన్ని ఎలా వాడాలో తెలుసుకుందామా!

దోమలు అరికట్టేందుకు వాడే రిపల్లెంట్ల వాసన కొందరికి పడదు. అలాంటి వారు నిమ్మరసం తొక్కల్ని మరిగించి, అందులో కాస్త లవంగం నూనె కూడా చేర్చి గది మూలల్లో స్ప్రే చేస్తే సరి.

వంటింట్లో ఘాటైన వాసనలు వస్తున్నప్పుడు... మగ్గు నీళ్లలో ఒక నిమ్మకాయను పిండి, నాలుగు చుక్కల వెనిల్లా ఎసెన్స్‌ కలిపి మరిగించాలి. ఆ నీళ్లని గదిలో ఓ మూలన ఉంచితే మంచి సువాసన వస్తుంది.

దుస్తులు సరిగా ఆరనప్పుడు ఓ రకమైన వాసన వస్తుంటాయి. అలాంటప్పుడు దుస్తులు జాడించే నీళ్లల్లో కాస్త నిమ్మరసం పిండి ఆరేస్తే సరి. బ్యాక్టీరియా చేరదు. మంచి వాసనా వస్తుంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్