వంటింటి నుంచి అనారోగ్యాలు..

పోషకాహారంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే.. ఆ ఆహారాన్ని తయారు చేసే వంటిల్లే అనారోగ్యాలకు నిలయమైతే.. ఆ కుటుంబం వ్యాధుల పాలవడం ఖాయం అంటున్నారు నిపుణులు. నివారణగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు.

Updated : 01 Nov 2022 01:09 IST

పోషకాహారంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే.. ఆ ఆహారాన్ని తయారు చేసే వంటిల్లే అనారోగ్యాలకు నిలయమైతే.. ఆ కుటుంబం వ్యాధుల పాలవడం ఖాయం అంటున్నారు నిపుణులు. నివారణగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు.

జారు నుంచి తెచ్చిన వెంటనే కూరగాయలను శుభ్రమైన వస్త్రంతో తుడిచి ఫ్రిజ్‌లో భద్రపరచాలి. వంటకు కావాల్సినప్పుడు ఉప్పు కలిపిన నీటిలో పావు గంట నాననిచ్చి ఆ తర్వాతే వినియోగించాలి. అప్పుడే వాటిపై ఉన్న బ్యాక్టీరియా తొలగుతాయి. లేదంటే అవి మన శరీరంలోకి చేరి పలు అనారోగ్యాలకు కారణమవుతాయి. తొక్కలు తీసే బంగాళాదుంప, బీర, ఆనప వంటి కూరగాయలను సాధారణ నీటితో శుభ్రపరిస్తే చాలు. వాటిని చెక్కు తీసి ఉడికించడం వల్ల బ్యాక్టీరియా ఉన్నా.. నశిస్తాయి. నాన్‌స్టిక్‌ పాత్రల్లో ఉండే పూత గీతలు పడినా, పోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దు. దాన్లోని రసాయనాలు వంటకాల్లో కలిసి తీవ్ర అనారోగ్యాల బారిన పడతాం.

ఒకే పీటపై.. మాంసం, చేపలను కట్‌ చేసిన తర్వాత ఆ పీటను శుభ్రం చేసి, ఉప్పు, నిమ్మ చెక్కతో రుద్ది బాగా కడగాలి. ఆ తర్వాత మాత్రమే దాని మీద కూరగాయలు కోయాలి. లేదంటే మాంసంలో ఉండే బ్యాక్టీరియా పీటపైనే ఉండిపోయి, కూరగాయల్లోకీ చేరే ప్రమాదం ఉంది. మాంసాన్ని ఉప్పు కలిపిన బియ్యం కడుగులో శుభ్రం చేసి, ఆ తర్వాత మంచి నీటిలో కడిగితే మంచిది. పచ్చిమాంసం, చేపలు వంటివి ఫ్రీజర్‌లో భద్రపరిచినప్పుడు అక్కడి అతి తక్కువ ఉష్ణోగ్రతవల్ల సూక్ష్మజీవులు చేరే అవకాశం ఉండదు. వండాలనుకున్నప్పుడు బయటకు తీసి కాసేపు ఉంచుతాం. ఇలా బయటపెట్టినప్పుడే సూక్ష్మజీవులు చేరే అవకాశమెక్కువ. అలాకాక ఫ్రిజ్‌లోనే ఉంచి ఉష్ణోగ్రతను తగ్గిస్తే, కాసేపటికి చల్లదనం తగ్గి, వంటకు సిద్ధమవుతుంది. మాంసాన్ని బాగా ఉడికించి వండితే అజీర్తి సమస్యలుండవు.

శుభ్రత... గిన్నెలు, పొయ్యి శుభ్రం చేసే స్క్రబ్‌లను రోజూ సబ్బు కరిగించిన వేడినీటిలో కాసేపు నానబెట్టాలి. ఆ తర్వాత ఉతికి ఆరనివ్వాలి. లేదంటే బ్యాక్టీరియా చేరి, వీటితో గిన్నెలు, ఆహారం కలుషితమవుతాయి. అనారోగ్యాలకు కారణమవుతాయి. వంట పూర్తయ్యాక పొయ్యి చుట్టు పక్కల శుభ్రం చేయడం మరవ కూడదు. ఫ్రిజ్‌ను రెండు మూడు వారాలకొకసారి తుడిచి శుభ్రం చేయాలి. కూరగాయలు తాజాగా ఉన్నాయో లేదో చూడటం తప్పని సరి. కనీసం నెలకొకసారి ఫ్రీజర్‌లో ఉంచిన పదార్థాల గడువు తేదీలను పరిశీలించాలి. గడువు ముగిస్తే బయట పడేయాలి. ఆహారం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలి. రెండు
మూడు రోజుల కన్నా ఎక్కువగా ఆహారాన్ని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచకూడదు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే ఆరోగ్యానికి హానికరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్