రంగుల హరివిల్లుగా మెట్లు..

ఇంట్లో లేదా బయట మెట్లు సాదాగా ఉంటే ఆకర్షణీయంగా అనిపించదు. వాటికి సప్తవర్ణాలు వేసి చూడండి. రంగుల హరివిల్లు ఇంట్లో నాట్యమాడుతున్నట్లే ఉంటుంది.

Published : 05 Nov 2022 00:12 IST

ఇంట్లో లేదా బయట మెట్లు సాదాగా ఉంటే ఆకర్షణీయంగా అనిపించదు. వాటికి సప్తవర్ణాలు వేసి చూడండి. రంగుల హరివిల్లు ఇంట్లో నాట్యమాడుతున్నట్లే ఉంటుంది.

ఇంటి మధ్య నుంచి పై అంతస్థుకు మెట్లు ఉన్నప్పుడు వాటికి ఒకే వర్ణం వేయడం పాత ఫ్యాషన్‌. ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క రంగు చేయడం ఇప్పుడు నయా ట్రెండ్‌. లేత, ముదురు వర్ణాలను వరుసగా మెట్లకు వేసినప్పుడు నట్టింట హరివిల్లు విరిసినట్లే అనిపిస్తుంది. ఇల్లంతా కొత్తందాలను తెచ్చిపెడుతుంది. రంగులతోపాటు ప్రతి మెట్టుపై మూలగా వచ్చేలా వరుసగా ఇండోర్‌ప్లాంట్‌ తొట్టెలను సర్దితే చాలు. ఇల్లంతా కళకళలాడుతుంది. అందానికందమూ. మొక్కల వల్ల ఇంట్లో ఆక్సిజన్‌ ఆరోగ్యాన్నీ.. తెచ్చి పెడుతుంది.

ఇంద్రజాలం..

ఇంటికి రంగులు వెలిసినట్లు అనిపించినప్పుడు ఈ ఆలోచనను వెంటనే పాటించేయండి. మెట్లకన్నింటికీ సప్త వర్ణాలు కలగలిపి వరసగా అద్దితే చాలు. లేదా మధ్యలో లేత వర్ణం, రెండేసి మెట్లకు ముదురు వర్ణం వచ్చేలా వేయండి. ఏదో కొత్తగా ఇంద్రజాలం చేసినట్లు ఇల్లంతా రంగుల మయమవుతుంది. మనసంతా ఉత్సాహంగా మారుతుంది. పాతగా అనిపించిన చోట.. మెరుపు మెరిసినట్లుగా తళుక్కుమంటూ మనసును ఆకట్టుకుంటుంది. ప్రతి మెట్టుకూ ఒక్కొక్క వర్ణం వేసి వదిలేయకుండా, ఆ మెట్ల అంచుల్లో ఆకుపచ్చని రంగులో పూలు, ఆకుల డిజైన్‌ జోడించండి. మరింత సృజనాత్మకత ఉట్టిపడుతుంది. మరింకెందుకాలస్యం.... మెట్లకన్నింటికీ రంగులద్దేయండి. ఇంట్లో ఇంద్రజాలం చేసేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్