అలంకారానికి తాళం..

పాత తాళాలన్నీ సాధారణంగా వృథా అవుతాయి. కొన్నిసార్లు ఇంట్లో ఎక్కడ చూసినా ఇవే కన్పిస్తుంటాయి. వీటినీ ఇంటి అలంకరణలో వినియోగించొచ్చు అంటున్నారు ఇంటీరియర్‌ నిపుణులు.

Published : 06 Nov 2022 00:53 IST

పాత తాళాలన్నీ సాధారణంగా వృథా అవుతాయి. కొన్నిసార్లు ఇంట్లో ఎక్కడ చూసినా ఇవే కన్పిస్తుంటాయి. వీటినీ ఇంటి అలంకరణలో వినియోగించొచ్చు అంటున్నారు ఇంటీరియర్‌ నిపుణులు.

ఇంట్లో కొత్త, పాత తాళాలు ఒక్కోసారి  కలిసిపోతుంటాయి. అత్యవసరానికి ఏది దేనిదో గుర్తించడానికి సమయం వృథా అవుతుంది. అందుకే పాత తాళాలనూ, కప్పలనూ విడిగా భద్రపరచాలి. పై అంతస్థుకి వెళ్లే మెట్ల పక్కగా పేలవంగా కనిపించే గోడను వీటితో కళ కళ లాడేలా చేయొచ్చు. గోడపై గుండ్రని ఆకారంలో చిన్నచిన్న మేకులు కొట్టాలి. వాటికి వృథాగా ఉన్న తాళాలను, కప్పలను ఒక్కొక్కటిగా పరిమాణాన్ని బట్టి వేలాడదీస్తే చాలు. గోడకు అలంకరణగా మారి, చూడటానికి కొత్తగా అనిపిస్తాయి.

ప్రత్యేకంగా.. పాతచెక్క ముక్కలాంటిది ఉంటే దాన్ని బాల్కనీలో గోడకు అమర్చాలి. దీనిపై వరుసగా చిన్నచిన్న మేకులు కొట్టి, వాటికి వృథా తాళాలను తగిలించాలి. సింపుల్‌గా ఉన్నా.. ప్రత్యేకంగా కనిపిస్తుంది. పెద్ద, చిన్న పరిమాణంలో రెండు గుండ్రని ఇనుప లేదా అట్టముక్కతో చేసిన రింగులు సిద్ధం చేసుకోవాలి. తాళాలకు సమానకొలతతో దారాలు కట్టి వీటిని రింగులకు చుట్టూతా వచ్చేలా ముడివేయాలి. షాండ్లియర్‌గా మారిన ఈ రింగులను పొడవైన తాడుతో గది మధ్యలో వేలాడదీస్తే చాలు. గాలికి చప్పుడు చేస్తూ చూడటానికీ అందంగా ఉంటాయి. గుండ్రని గాజుప్లేటుకు ఒకవైపు తాళాలను అందమైన ఆకారంలో జిగురుతో అతికించాలి. దీన్ని బల్లపై ఉంచితే ఇదొక అలంకరణ వస్తువు అవుతుంది. వృథాను కూడా వినియోగిస్తున్నామన్న తృప్తీ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్