చిత్రమైన అరిటాకులు

షాండిలియర్‌ లైట్లు, ఖరీదైన వాల్‌ హ్యాంగింగ్స్‌ కోసం వేలూ లక్షలూ ఖర్చుపెడితేనే ఇల్లు ఇంద్రభవనంలా అలరిస్తుంది అనుకుంటున్నారా?! నిజానికి కళాత్మకత కోసం ఎక్కడికో పరుగులు తీయనవసరం లేదు.

Published : 18 Nov 2022 00:16 IST

షాండిలియర్‌ లైట్లు, ఖరీదైన వాల్‌ హ్యాంగింగ్స్‌ కోసం వేలూ లక్షలూ ఖర్చుపెడితేనే ఇల్లు ఇంద్రభవనంలా అలరిస్తుంది అనుకుంటున్నారా?! నిజానికి కళాత్మకత కోసం ఎక్కడికో పరుగులు తీయనవసరం లేదు. ఆసక్తి, అభిరుచి ఉండాలే కానీ సొంపులూ సోయగాలను ఒడిసిపట్టుకోవడం కష్టమైన పనేం కాదు. ఇక్కడ చూడండి బంగారు కాంతులతో అలరిస్తున్న ఆకుల దొంతర కనువిందు చేస్తోంది కదూ! దీన్ని డ్రాయింగ్‌రూం, డైనింగ్‌హాల్‌, పడకగది... ఇలా ఎక్కడైనా అమర్చుకోవచ్చు. సోయగాలు చిందించే ఈ విచిత్రమైన ఆకులు ఏ దేశం నుంచి తెప్పించారు, ఎంత ధర ఉంటుంది అని ఆశ్చర్యపోతున్నారా? అబ్బే.. ఇవసలు నిజమైన ఆకులు కానే కాదు.. ఇదొక వాల్‌పోస్టర్‌. నమ్మశక్యంగా లేదా? కానీ నిజం. త్రీడీ ఎఫెక్ట్‌ ఉండటాన ఆకులు తుంచి అక్కడ గుచ్చినట్టే ఉంది. నచ్చితే మీరూ తెప్పించేసుకోండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్