టైర్లలో తోట

పాత టైర్లకు రంగులు వేసి ఫర్నిచర్‌గా వాడుతుండటం చూసే ఉంటారు. వీటిలో ఓ చిన్న పాటి తోటను పెంచొచ్చు. ఇంటికి అందాన్ని తెచ్చేలా మార్చేయొచ్చు.

Updated : 11 Dec 2022 05:02 IST

పాత టైర్లకు రంగులు వేసి ఫర్నిచర్‌గా వాడుతుండటం చూసే ఉంటారు. వీటిలో ఓ చిన్న పాటి తోటను పెంచొచ్చు. ఇంటికి అందాన్ని తెచ్చేలా మార్చేయొచ్చు. ఎలాగంటే..

టైర్లకు ముందుగా ముదురు, లేతవర్ణాల పెయింటింగ్‌ వేసి ఆరనివ్వాలి. వీటిని వరసగా రంగులకు తగినట్లుగా ఆకర్షణీయంగా కనిపించేలా తోటలో సర్దుకోవాలి. వీటిలో సేంద్రియ ఎరువు కలిపిన మట్టి నింపాలి. ఆ తర్వాత టేబుల్‌రోజ్‌, చామంతి, బంతి వంటి పూలమొక్కలను నాటాలి. తక్కువ కాలంలోనే పూలు పూసే మొక్కలైతే మంచిది. టైర్ల మధ్య వర్ణమయమైన పూలతో మొక్కలు తోటకే అందాన్ని తెస్తాయి. ఆకర్షణీయంగానూ కనిపిస్తాయి. అలాగే కూరగాయలు, ఆకుకూరలు కూడా నాటుకోవచ్చు. కొత్తగా అనిపిస్తాయి. తొట్టెలకు భిన్నంగానూ ఉంటాయి. ఎండపడే చోట వీటిని ముందుగానే సర్దితే చాలు. ఆ తర్వాత కదపాల్సిన పని ఉండదు.

చిరుతోటగా.. దీనికి నాలుగు టైర్లు ఉంటే చాలు. ముందుగా మూడింటిని సగానికి  అర్ధచంద్రాకారం వచ్చేలా కోయాలి. ఒక టైరును మధ్యలో ఉంచి చుట్టూతా ఈ ముక్కలను అందంగా సర్దాలి. మధ్య టైరులో పొడవుగా, గుబురుగా పెరిగే క్రోటన్స్‌ మొక్కను నాటి, చుట్టూతా టైర్లముక్కల లోపల త్వరగా పూలుపూసే క్రోటన్స్‌, చామంతి వంటి పూలమొక్కలను నాటుకుంటే చాలు. చూడటానికి చిరుతోటలా అనిపిస్తుంది. ఈ టైర్లన్నింటికీ ఒకే వర్ణం వేస్తే చూడ ముచ్చటగా ఉంటుంది. ఒకే పెద్ద టైరుకు ముదురు, లేత వర్ణాల్లో డిజైన్లు వేసి ఆరనిచ్చి మట్టి నింపాలి. ఇందులో కాక్టస్‌ మొక్కలు అయిదారు రకాలను టైర్‌లోపల నాలుగువైపులా నాటాలి. నిండుగా రకరకాల మొక్కలతో టైరు ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిని బాల్కనీ, ముందుగది మూలగానూ ఉంచొచ్చు. ఎక్కువగా నీటి అవసరం ఉండని మొక్కలనే దీనికి ఎంచుకొంటే బాగుంటుంది. ముదురు వర్ణం వేసిన టైర్లకు పైన చిన్న కొంకీ ఏర్పాటు చేసి గోడకు వేలాడదీసి, అందులో కాస్తంత మట్టి వేసి తీగజాతి పూలమొక్కలను వేస్తే చాలు. కిందకు వేలాడుతూ పూలతో తొట్టె నిండుగా కనిపిస్తుంది. పెరటి గోడకు ప్రత్యేక అందం వస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్