వృథా షాపింగ్‌ వద్దే వద్దు!

కొంతమందికి షాపింగ్‌ చేయడానికంటూ ప్రత్యేకంగా సందర్భం అక్కర్లేదు. కనిపించిందల్లా కొనేస్తారు. అందులోనూ పండగల సీజన్‌ రానే వచ్చింది.

Updated : 26 Dec 2022 06:38 IST

కొంతమందికి షాపింగ్‌ చేయడానికంటూ ప్రత్యేకంగా సందర్భం అక్కర్లేదు. కనిపించిందల్లా కొనేస్తారు. అందులోనూ పండగల సీజన్‌ రానే వచ్చింది. ఇలాంటప్పుడు డబ్బు వృథా కాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి.

* షాపింగ్‌లో దుస్తులు కొనేవాళ్లే ఎక్కువ. ఎప్పటి ట్రెండ్‌ అప్పటిదే. అందుకే అవసరానికి మించి కొనడం అంత మంచిది కాదు. మీ బడ్జెట్‌ దాటకుండా కొనాలంటే...మీ అవసరాలకు పోనూ ఎంత ఖరీదులో కొనాలనుకుంటున్నారో అంతే తీసుకెళ్లండి. అప్పుడు ఒక రూపాయి తక్కువకే కొనగలరు కానీ...దాటే ప్రసక్తి ఉండదు.

* కొందరు షాపింగ్‌కి వెళ్తారు... కానీ ఏం కొనాలో స్పష్టత ఉండదు. అలాంటి వారిలో మీరూ ఉన్నారా? షాప్‌కి వెళ్లడానికి ముందే...ఓ సారి బీరువా తెరిచి చూడండి. ఏఏ రంగుల దుస్తులు ఉన్నాయి. ఇప్పుడు అవసరం ఏంటి? ఎంత మొత్తంలో కొనుగోలు చేయాలనుకుంటున్నారు... ఇలా అన్ని విషయాలపై ఓ ఆలోచన ఉంటే షాపింగ్‌ భారం కాదు. కొత్తరకాల్నీ తీసుకోవచ్చు.

* ఒత్తిడిగా ఉన్నప్పుడో, చివరి నిమిషంలో హడావిడిగా ఏవో ఒకటి అనుకుని షాపింగ్‌ చేయడం మంచిది కాదు. దీనివల్ల మీరు కొనుక్కున్న వాటిపై సంతృప్తి ఉండదు. మీ వెంట మంచి అభిరుచి కలిగిన వారు ఒక్కరినైనా తోడు తీసుకువెళ్లండి. ఫలితం ఉంటుంది.

* చాలామంది దుస్తులను కొనేప్పుడు వాటికి ఇచ్చే రాయితీలను దృష్టిలో పెట్టుకునీ కొనుక్కుంటారు. దానికంటే ముందు అవి ఎంత నాణ్యంగా ఉన్నాయి...అవి ఏ మేరకు నప్పుతాయి అన్న విషయాలను మాత్రం గమనించుకోండి. ఇది మీకెంతో మేలు చేస్తుంది. అంతేకాదు...ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తే అదనపు ఛార్జీలు ఎంతవుతున్నాయో లెక్కేసుకోండి. అదే దుకాణానికి వెళ్తే...రానూ, పోనూ ఛార్జీలూ ఇతరత్రా ఖర్చులనూ పరిశీలించండి. అప్పుడు అర్థమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్