తేలిగ్గా శుభ్రం చేద్దాం!

పండగ అంటే మొదట గుర్చొచ్చేది ఇంటి శుభ్రత. గదుల్ని తడిబట్ట పెట్టి శుభ్రం చేశాక నడుము నొప్పి మామూలుగా ఉండదు. ఇంకో నాలుగు రోజులు లేవలేం.

Published : 10 Jan 2023 00:06 IST

పండగ అంటే మొదట గుర్చొచ్చేది ఇంటి శుభ్రత. గదుల్ని తడిబట్ట పెట్టి శుభ్రం చేశాక నడుము నొప్పి మామూలుగా ఉండదు. ఇంకో నాలుగు రోజులు లేవలేం. అదే ఈ పరికరాలు మీ చేతిలో ఉంటే అంత అలసిపోవాల్సిన అవసరమే ఉండదు. తేలిగ్గా పనిచేసుకోవచ్చు..


సెల్ఫ్‌ రింగింగ్‌ మాప్‌: పొడవాటి కర్రకి చివర ‘ఎక్స్‌’ ఆకారంలో మైక్రోఫైబర్‌తో చేసిన మాప్స్‌ ఉంటాయి. మామూలుగా అయితే శుభ్రం చేసిన మురికిని వేరే బకెట్‌లోకి చేత్తో పిండుతూ ఉంటాం కదా! ఈ పరికరంతో మనకా బాధ ఉండదు. కర్రకి ఉన్న బటన్‌ని వెనక్కి లాగితే చాలు. దానంతట అదే మురికిని చక్కగా పిండేసుకుంటుంది. మనం చేత్తో పదేపదే మురికి నీళ్లని తాకి, అనారోగ్యాలు తెచ్చుకునే ప్రమాదం ఉండదు. ప్యాడ్స్‌ అరిగిపోయాయి, పాతబడ్డాయి అనుకుంటే వాటిని మార్చుకొనే సౌకర్యం కూడా ఉంటుంది. ఎటైనా సులభంగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి శుభ్రత పక్కగా ఉంటుంది.


రొటేటింగ్‌ మాప్‌: గదుల్లో నేలని మాత్రం శుభ్రం చేస్తే సరిపోతుందా? గోడ అంచులు, మూలలు కూడా మురికి పట్టి ఉంటాయి. వీటిని శుభ్రం చేయడానికి ప్రత్యేకించి శ్రమ పడకుండా వచ్చిందే రొటేటింగ్‌ రౌండ్‌ మైక్రోఫైబర్‌ ఫ్లాట్‌ మాప్‌. మూలలని శుభ్రం చేయడానికి వీలుగా సగానికి వంగి ఉంటుంది కాబట్టి సులభంగా ఉపయోగించవచ్చు.


స్ప్రే మాప్‌: మగ్‌తో నీళ్లు వేయడం.. చీపురుతో రుద్ది, దాన్ని వేరే వస్త్రంతో ఆరే వరకూ తుడవడం చేస్తున్నారా? స్ప్రే మాప్‌తో అంత శ్రమ ఉండదు. దీనికి పైన ఒక బాటిల్‌ ఉంటుంది. దాన్నిండా నీళ్లు నింపి అందులో మీకు నచ్చే ఎసెన్షియల్‌ ఆయిల్‌ లేదా ఏదైనా క్లీనర్‌ వేసి మూత పెట్టేయండి. తుడిచేటప్పుడు స్విచ్‌ ఆన్‌ చేస్తే ఎక్కువ తక్కువ కాకుండా కావాల్సినన్ని నీళ్లు అదే చల్లుకుంటుంది. స్ప్రేమాప్‌తో రెండు వైపులా తుడుచు కోవచ్చు. శుభ్రతకి శుభ్రత... పరిమళానికి పరిమళం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్