ఇంటిలోపలా ఎంచక్కా...!

మొక్కలు పెంచాలని ఉన్నా... ఆరుబయట స్థలం లేదే అని బాధ పడేవారు... ఈ మొక్కల్ని ఇంటిలోపలే చక్కగా పెంచుకోవచ్చు. ఇవి పచ్చదనాన్ని అందించడమే కాదు... గాలిలోని రసాయనాలను శుద్ధి చేస్తాయి. ఇంటిలోపల పెంచుకోగలిగే మొక్కల్లో మొదటి స్థానం పీస్‌ లిల్లీదే.

Published : 18 Jan 2023 04:07 IST

మొక్కలు పెంచాలని ఉన్నా... ఆరుబయట స్థలం లేదే అని బాధ పడేవారు... ఈ మొక్కల్ని ఇంటిలోపలే చక్కగా పెంచుకోవచ్చు. ఇవి పచ్చదనాన్ని అందించడమే కాదు... గాలిలోని రసాయనాలను శుద్ధి చేస్తాయి.

పీస్‌ లిల్లీ: ఇంటిలోపల పెంచుకోగలిగే మొక్కల్లో మొదటి స్థానం పీస్‌ లిల్లీదే. తక్కువ కాంతిని గ్రహించే ఈ మొక్క ఆకులతో పాటూ తెల్లటి పూలూ ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంటాయి. కాంతి అవసరం తక్కువే అయినా... నీళ్లు పోస్తుంటే చాలు చక్కగా ఎదుగుతుంది. ఈ మొక్క గాలి నాణ్యతను మెరుగు పరుస్తుంది.


అరేకా పామ్‌: కొబ్బరి ఆకుల్ని తలపించేలా కనిపించే ఈ మొక్కని ఇంట్లో ఏ మూల ఉంచినా నిండుగా కనిపిస్తుంది ఆ ప్రదేశం. అలంకరణ మొక్కగానూ పెంచుకోగలిగే  ఇది తక్కువ కాంతిలోనూ చక్కగా పెరుగుతుంది.


స్నేక్‌ ప్లాంట్‌: ఆకర్షణీయమైన పొడవాటి ఆకులతో చూడ ముచ్చటగా ఉంటుంది ఈ మొక్క. మైక్రోటోన్డ్‌ సిరామిక్‌ పాట్‌లో పెట్టి డెస్క్‌ టేబుల్‌ మీద ఉంచితే ఎంత బాగుంటుందో! సక్యులెంట్‌లు. తక్కువ నీళ్లు, చక్కటి కాంతి ఉంటే చాలు... ఎండ తగలకపోయినా ఆరోగ్యంగా ఎదుగుతాయి సక్యులెంట్లు. వీటిని హాల్లో, టీవీ దగ్గర, కిటికీల పక్కన, గుమ్మం దగ్గర పెంచుకోవచ్చు. ఈ సక్యులెంట్ల సాయంతో అందమైన కంటైనర్‌ తోటల్నీ తీర్చిదిద్దొచ్చు.


కలబంద: తక్కువ నిర్వహణతో ఇండోర్‌లో పెరిగే ఉష్ణమండల మొక్కల్లో కలబంద కూడా ఒకటి.  పారదర్శకంగా అయినా కొంత కాంతి ఈ మొక్కకు అవసరం. వారానికి ఒకటి రెండు సార్లు నీళ్లు అందిస్తే చాలు ఆరోగ్యంగా ఎదుగుతుంది. వీటితో పాటూ ఫిలడెండ్రాన్‌, ఇంగ్లిష్‌ ఐవీ. వెదురు, స్పైడర్‌ ప్లాంట్‌ వంటి మరికొన్ని మొక్కలనూ పెంచుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్