వృథాతో అలంకరణ..
బిర్యానీ, రకరకాల స్వీట్లను ఇప్పుడు చిన్నచిన్న కుండల్లోనూ విక్రయిస్తున్నారు. ఇటువంటివి డోర్ డెలివరీ తెప్పించుకున్నప్పుడు ఇంట్లో వృథాగా పేరుకుంటున్నాయి అనుకోవద్దు.
బిర్యానీ, రకరకాల స్వీట్లను ఇప్పుడు చిన్నచిన్న కుండల్లోనూ విక్రయిస్తున్నారు. ఇటువంటివి డోర్ డెలివరీ తెప్పించుకున్నప్పుడు ఇంట్లో వృథాగా పేరుకుంటున్నాయి అనుకోవద్దు. గృహాలంకరణలో వీటిని వినియోగించి చూడండి. గదిగదికీ కొత్త అందాన్ని తెచ్చినవాళ్లవుతారు.
ఒకే పరిమాణం ఉన్న కుండలను ఎంపిక చేసి లేత లేదా ముదురు రంగు పెయింటింగ్ వేసి ఆరనివ్వాలి. వీటిలో మట్టి నింపి ఇండోర్, కాక్టస్ వంటి మొక్కలనుంచాలి. ఆ తర్వాత వీటిని క్రాస్‌గా వచ్చేలా రంగురంగుల దారాలు కలిపిన తాడుకు కట్టాలి. ఇప్పుడీ తాడును బాల్కనీ లేదా వరండాలో గోడకు ఓ మూలగా తగిలిస్తే చాలు.
ఆర్చ్‌లా.. వెడల్పు తక్కువగా, పొడవెక్కువగా ఉన్న చెక్కపై ఆర్చ్‌లా వచ్చేట్లు మూడు చోట్ల రంధ్రాలు చేసిన పొడవైన గొట్టాన్ని వంచి అతికేలా ఏర్పాటు చేయాలి. కుండల్లో మట్టి నింపి ఒకే రకమైన లేదా రెండుమూడు రకాల్లో ఇండోర్ మొక్కలను నాటాలి. వీటిని ఉట్టి తాడు లాంటి దాంట్లో ఉంచి ఆర్చ్‌కు చేసిన రంధ్రాల్లోంచి వరుసగా వచ్చేలా కిందకు వేలాడేలా కట్టాలి. అలాగే కింద ఉన్న చెక్కపైన కూడా ఒక కుండను ఉంచి చుట్టూ అందమైన గులక రాళ్లను సర్దితే చాలు. దీన్ని ఏ గదిలో ఉంచినా అందంగా అనిపిస్తుంది. మొక్కల వల్ల గదుల్లో గాలి శుభ్రపడి ఆరోగ్యాన్ని అందిస్తాయి.
పెయింటింగ్‌తో.. రెండు మూడు కుండలకు ఆకుపచ్చ, నీలం, ఎరుపు వంటి ముదురు వర్ణాల్లో పెయింటింగ్ వేసి ఆరనివ్వాలి. ఆ తర్వాత ప్రతి కుండపై లేతవర్ణాల పెయింట్‌తో చిన్న చిన్న ముగ్గులు లేదా పూల డిజైన్ వేసి ఆరబెట్టాలి. వీటిలో మట్టి నింపి తలా ఒకదాంట్లో మొక్కలుంచి చూడండి. వీటిని భోజనబల్లపై ఉంచినా చాలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.