Published : 29/01/2023 00:02 IST

పూల మ్యాట్లు పరిచేద్దామా!

పండగలప్పుడు, ప్రత్యేక పూజల సమయంలో మందిరాన్ని చక్కగా అలంకరించుకుంటాం. గడపముందు అందంగా రంగవల్లులు దిద్దుతాం. రంగోలీలు వేసి పూలతో అలంకరిస్తాం. అవి పూజ గదికి ప్రత్యేక శోభను తీసుకువస్తాయి. అయితే పూలతో రంగోలీ వేయడం శ్రమతో కూడుకుంది. సమయమూ పడుతుంది. దానికి పరిష్కారమే రెడీమేడ్‌ పూల మ్యాట్లు. ఇవి మార్కెట్లో రకరకాల డిజైన్లలో దొరుకుతున్నాయి. వీటితో పూజగది ప్రత్యేకంగా కనిపించడమే కాదు.. సమయమూ ఆదా అవుతుంది. ఈ ముచ్చటైన మ్యాట్లు మీ మనసూ దోచాయా మరి?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని