పచ్చదనాన్ని అతికిద్దాం!

చూడ్డానికి పచ్చగా ప్రకృతిని తలపించేే.. కృత్రిమ మాస్‌ రాక్స్‌తో ఇంటిని పచ్చదనంతో నింపేయొచ్చు అంటున్నారు ఇంటీరియర్‌ నిపుణులు..

Published : 02 Feb 2023 00:04 IST

చూడ్డానికి పచ్చగా ప్రకృతిని తలపించేే.. కృత్రిమ మాస్‌ రాక్స్‌తో ఇంటిని పచ్చదనంతో నింపేయొచ్చు అంటున్నారు ఇంటీరియర్‌ నిపుణులు..

మాస్‌రాక్స్‌ను పలురకాల పరిమాణాల్లో ఎంపిక చేసుకోవాలి. వాటిని ముందుగది టీపాయిపై సర్ది, వాటిపై పక్షుల బొమ్మలను అక్కడక్కడా ఉంచితే చాలు. అలాగే పొడవెక్కువగా, వెడల్పు తక్కువగా ఉండే ఒక చెక్క ఫ్రేంను తీసుకొని ఇందులో  ఈ రాళ్లను జిగురుతో అంటించాలి. ఆరిన తర్వాత రంగురంగుల ప్లాస్టిక్‌ పూలను డిజైన్‌గా అంటించి ఆరనివ్వండి. దీన్ని ముందుగది గోడకు తగిలిస్తే చాలు. ఆకర్షణీయంగా మారుతుంది. పూలు లేకుండా మొత్తమంతా ఈ రాళ్లను సర్దిన ఫ్రేంలను సోఫా, దివాన్‌ వెనుక తగిలించినా చాలు. చక్కని లుక్‌ వస్తుంది.

అడవిలా.. చిన్నచిన్న ఫ్రేంలను రెండింటిని ఎంపిక చేసుకొని మొత్తం రాళ్లను పేర్చాలి. వాటి వెనుక ప్లాస్టిక్‌ చెట్ల కొమ్మలు, ఊడలు అంటించాలి. ఈ ఫ్రేంలను హాల్‌ లేదా పడకగదిలో గోడకు తగిలిస్తే చాలు. సహజ అటవీ వాతావరణం నట్టింట్లో ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే ఈ రాళ్లూ, కృతిమ మొక్కలు, ఆకులతో అద్దానికి ఓ పక్కగా అలంకరిస్తే, ప్రాంతమంతా ప్రత్యేకంగా మారిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్