ప్రేమగా పెంచేద్దాం...

పిల్లలనే కాదు. మొక్కలనూ ప్రేమగా పెంచాలంటున్నారు నిపుణులు. ఆరోగ్యంతోపాటు మనసుకు సాంత్వన కలిగించే ఇండోర్‌ మొక్కలను పెంచడానికి ఇప్పుడు హగ్గింగ్‌ ప్లాంటర్స్‌ వస్తున్నాయి.

Published : 10 Feb 2023 00:47 IST

పిల్లలనే కాదు. మొక్కలనూ ప్రేమగా పెంచాలంటున్నారు నిపుణులు. ఆరోగ్యంతోపాటు మనసుకు సాంత్వన కలిగించే ఇండోర్‌ మొక్కలను పెంచడానికి ఇప్పుడు హగ్గింగ్‌ ప్లాంటర్స్‌ వస్తున్నాయి. అవేంటో చూద్దాం.

మొక్కల పెంపకం మనసుకు హత్తుకొనే అభిరుచిలాంటిది. అందుకే గుండెలకు దగ్గరగా ఉండేలా తొట్టెల తయారీ ఈ ప్లాంటర్స్‌లో కనిపిస్తుంది. స్నేహానికి ప్రతీకగా ఉండే టెడ్డీబేర్‌ చేతుల్లో తొట్టె కలిసి ఉంటుంది. ఇందులో మట్టి నింపి ఇండోర్‌ప్లాంట్‌ పెంచాలి. చూడముచ్చటగా ఉండే ఈ తొట్టెను ఇంట్లో ఏ గదిలోనైనా టేబుల్‌పై ఉంచితే చాలు. ఆ గదంతా ప్రేమతో నిండినట్లు అనిపిస్తుంది.

ఒకరికొకరుగా.. తల్లిదండ్రుల ప్రేమను ఆస్వాదిస్తూ పెరిగే పిల్లల్లా ఇరువురి చేతుల మధ్య గాజుతొట్టె అమర్చడం చూడటానికి ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో నీటిని నింపి మనీప్లాంట్‌ వంటి మొక్కను పెంచాలి. రీడింగ్‌ టేబుల్‌ లేదా పడకగదిలో కిటికీకెదురుగా ఎండపడేలా టీపాయిపై ఉంచితే చాలు. ఇరువురి చేతుల్లో ఈమొక్క ప్రేమతో పెరిగే చిన్నారిలా అనిపించి మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తుంది.

సంతోషంతో.. లాఫింగ్‌బుద్ధను పోలి ఉండే ఈ బొమ్మ చేతుల్లో తొట్టె అపురూపంగా కనిపిస్తుంది. ఏదైనా ఇండోర్‌ప్లాంట్‌ను ఇందులో పెంచి గది మధ్యలో టీపాయిపై ఉంచి చూడండి. ఇల్లంతా సంతోషంతోపాటు సానుకూలత నిండినట్లు ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్