Published : 15/02/2023 00:19 IST

మరకలు పోగొట్టే పంచదార

ఆహారపదార్థాలకు తీపి తెచ్చే పంచదారంటే మెచ్చనిది ఎవరు? కానీ, దీన్ని ఆహారంలో ఎంత తక్కువ వాడితే అంత మంచిదంటారు వైద్యులు. మరి దీన్ని కొంచెం వినియోగిస్తే చాలు...మరెన్నో ప్రయోజనాలూ ఉన్నాయని మీకు తెలుసా? అవేంటంటే...

* పూలవాజుల్లో నీళ్లు మార్చిన ప్రతిసారీ ఆ నీళ్లలో పావుకప్పు పంచదార కూడా కలిపితే పూలు వాడిపోకుండా తాజాగా ఉంటాయి.

* బేక్‌ చేసిన బిస్కెట్లూ, పఫ్‌లు నిల్వ చేస్తుంటే ఆ డబ్బాలో ఓ చిన్నమూటలో పంచదారని వేసి పెట్టండి. పదార్థాలు నిల్వ వాసన రాకుండా ఉంటాయి.

* గడ్డిజాతి మొక్కల్ని(పోర్ట్యులాకా, లెమన్‌గ్రాస్‌, వీట్‌గ్రాస్‌)వంటివి పెంచేటప్పుడు మొదట్లో కొద్దిగా పంచదారని వేయండి. చక్కగా ఏపుగా ఎదుగుతాయి.

* దుస్తులపై పడ్డ ఆకు మరకలు పోవాలంటే గోరువెచ్చని నీళ్లలో పంచదారని కలిపి ఆ నీళ్లని మరకపై చిలకరించి పావుగంటపాటు వదిలేయాలి. కాసేపటికి సబ్బుతో ఉతికేస్తే మరక మాయమవుతుంది.

* చేతికంటిన మొండి గ్రీజు మరకలు పోవాలంటే... కొద్దిగా పంచదార చల్లుకుని తర్వాత సబ్బుతో కడిగేసుకుంటే సరి. సులువుగా వదులుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని