Published : 17/02/2023 00:26 IST

ఇలా చేసి చూడండి...

ఇంట్లో అందరికీ కుదిరి.. ఆర్థిక వెసులుబాటు ఉన్నప్పుడు సరదాగా టూర్‌ వెళ్లొస్తే శారీరక అలసట తీరుతుంది, మానసిక ప్రశాంతత చిక్కుతుంది. కానీ అన్నిసార్లూ అలా కుదరదు కదూ! మరి రోజూవారీ చిరాకుల నుంచి బయటపడి కాస్తంత సేదతీరడం ఎలా కుదురుతుంది? మనసుంటే మార్గం తప్పకుండా ఉంటుందంటారు కదా! ఇలా చేసి చూడండి... మీ ఇంట్లో కొంచెం ఖాళీ స్థలముందా? మొక్కల మధ్యలో ఎంచక్కా ఉయ్యాల బల్ల వేలాడదీయండి. ఒక పక్కన చిన్న నీళ్ల కొలను పెట్టించుకోండి. సాధ్యం కాదంటే వెడల్పాటి నీళ్ల తొట్టి ఉంచి.. అందులో తామరపూలు పెరిగేలా చేయండి. కాసేపు అక్కడ విశ్రమించారంటే ఆ ప్రకృతి సోయగం మిమ్మల్ని అలరిస్తుంది. నచ్చిన నెచ్చెలితో కబుర్లు కలబోసుకోడానికి ఇంతకంటే అందమైన, ప్రశాంతమైన ప్రదేశం ఇంకెక్కడుంటుంది చెప్పండి?!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని