వాకిట్లో ఒత్తిడి తగ్గించే మొక్కలు

కొందరు మొక్కల పెంపకం పెద్ద శ్రమ అనుకుంటారు. పొద్దున్నే కూరలు తరగడం దగ్గర్నుంచి రాత్రి ఖాళీ అయిన వంటపాత్రలను శుభ్రపరిచే వరకూ నిరంతరం ఏదో పని చేస్తూనే ఉంటాం.

Updated : 21 Feb 2023 05:28 IST

కొందరు మొక్కల పెంపకం పెద్ద శ్రమ అనుకుంటారు. పొద్దున్నే కూరలు తరగడం దగ్గర్నుంచి రాత్రి ఖాళీ అయిన వంటపాత్రలను శుభ్రపరిచే వరకూ నిరంతరం ఏదో పని చేస్తూనే ఉంటాం. వీటితో పోలిస్తే మొక్కల్ని పెంచడంలో అలసటే కలగదు, మనసుకు నచ్చే మంచి వ్యాపకం. మీరూ ప్రయత్నించి ఆనందాలను మీ ఖాతాలో జమచేసుకోండి! ప్రత్యేక పోషణ అవసరం లేని ఈ ఔషధ మొక్కలతో పని మొదలుపెట్టండి. చిన్న కుండీల్లో సైతం వీటిని సునాయాసంగా పెంచేయొచ్చు.

లెమన్‌ బామ్‌... పుదీనాను పోలి ఉండే లెమన్‌ బామ్‌ ఆకులు నిమ్మ సువాసనలు వెదజల్లుతాయి. వేసవిలో పూలు పూసి తేనెలా మధురంగా ఉంటాయి. పురుగూపుట్రా, దోమకాటుతో వచ్చే దద్దుర్లు, బొబ్బలకు లెమన్‌ బామ్‌ ఆకు లేపనం ఔషధంలా పనిచేస్తుంది. ఈ ఆకుల కషాయంతో జలుబు, జ్వరాలు, అజీర్ణం, నరాల ఒత్తిడి, థైరాయిడ్‌ సమస్యలు, ఆందోళన, నిద్రలేమి, వాతరోగం, తలనొప్పులు తగ్గుతాయి. ఇంత ఉపయుక్తమైన మొక్క ఇంట్లో ఉంటే ప్రయోజనమేగా!

ఖస్‌ ఖస్‌... గడ్డిని పోలిన ఈ మొక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్‌ గుణాలున్నాయి. మంట, గాయాలను తగ్గిస్తుంది. నరాల వ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది. ఆర్థరైటిస్‌, కీళ్లరోగాలు, కండరాల నొప్పులు చర్మ పగుళ్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కోపం, ఆందోళన, హిస్టీరియాల చికిత్సలో దీన్ని ఔషధంగా ఉపయోగిస్తారు. ఇంత మంచి మొక్కను పెంచుకోవడం సంతోషమే కదా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్