Published : 24/02/2023 00:20 IST

తాజాగా.. తాగేయొచ్చు!

ఎండలు ముదిరిపోతున్నాయి. ఈ కాలం తిండి ఏమాత్రం సహించదు. ద్రవపదార్థాలపైకి మనసు మళ్లుతుంటుంది. ఇంట్లో ఉంటే సరే! ఉద్యోగినులకు, ప్రయాణాల్లో తాజా పండ్ల రసాలు అసాధ్యం కదా! బయట తాగుదామంటే కొన్నిసార్లు కుదరకపోవచ్చు. ఇంకొన్నిసార్లు శుభ్రత దృష్ట్యా మనసొప్పదు. అలాంటి వారి కోసం వచ్చిందే ఈ బాటిల్‌ బ్లెండర్‌. చూడటానికి నీళ్లసీసాలాగే ఉంటుంది. గాజుతో తయారైన ఈ బాటిల్‌ కింది భాగంలో చిన్న బ్లెండర్‌ ఉంటుంది. పండ్ల రసం తాగాలి అనిపించినప్పుడు కూడా తెచ్చుకున్న పండ్లను అందులో వేసి, బటన్‌ నొక్కితే చాలు. క్షణాల్లో జ్యూస్‌ సిద్ధం. శుభ్రత సులువు. ఇంటివద్ద ఛార్జింగ్‌ పెట్టుకుంటే రోజంతా వాడుకోవచ్చు. బాగుంది కదూ! మీకూ కావాలనిపిస్తే ఆన్‌లైన్‌ వేదికల్లో వెతికేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని