వ్యర్థాలు అర్థవంతంగా

ప్లాస్టిక్‌ వాతావరణ కాలుష్యాన్ని పెంచడమే కాకుండా ఇంకెన్ని అనర్థాలు తెచ్చిపెడుతుందో మనందరికీ తెలిసిందే. కానీ మినరల్‌ వాటర్‌ రూపంలో ప్లాస్టిక్‌ బాటిళ్లు మనచుట్టూ గుట్టలుగా పేరుకుంటున్నాయి.

Updated : 28 Feb 2023 05:32 IST

ప్లాస్టిక్‌ వాతావరణ కాలుష్యాన్ని పెంచడమే కాకుండా ఇంకెన్ని అనర్థాలు తెచ్చిపెడుతుందో మనందరికీ తెలిసిందే. కానీ మినరల్‌ వాటర్‌ రూపంలో ప్లాస్టిక్‌ బాటిళ్లు మనచుట్టూ గుట్టలుగా పేరుకుంటున్నాయి. ఇలా వ్యర్థంగా మిగిలే ప్లాస్టిక్‌ సీసాలతో ఎన్నో గృహోపకరణాల్ని, అలంకరణ వస్తువుల్ని రూపొందించవచ్చు. అలా చేస్తూ కాస్తయినా ఊరట పొందుదామా...

* పురికొసను ఎర్రటిదో మరేదైనా మీకునచ్చిన రంగులో ముంచి తీసి ఆరబెట్టండి. దాన్ని ప్లాస్టిక్‌ సీసాకు ఖాళీ లేకుండా చుట్టేయండి. లేదా మీకు చేతనైన బొమ్మలు వేయండి. కాదంటే సీసాకు మీకు నచ్చిన పూలూ లతలున్న కాగితాన్ని అతికించండి. అంతే..అదొక డెకరేటివ్‌ పీస్‌లా తయారవుతుంది. అందులో పూలగుత్తులు పెట్టారంటే చక్కటి ఫ్లవర్‌వాజ్‌ అయి ఆహా అనిపిస్తుంది.

* ప్లాస్టిక్‌ సీసాల్లో చిన్న చిన్న మొక్కల్ని పెంచవచ్చు. చేయాల్సిందల్లా కాస్తంత రంధ్రం చేయడం. వీటిని సీలింగుకు వేళ్లాడదీస్తే బాల్కనీకి ప్రత్యేక అందం వస్తుంది.

* సీసాను సగం కత్తిరించి కళాత్మకంగా రంగుల కాగితాలు అతికించారంటే పెన్‌ స్టాండులుగా అలరిస్తాయి. వీటిల్లో పిల్లలకు స్నాక్స్‌ పెట్టినా ఆస్వాదిస్తూ తింటారు.

* సీసాలో పైభాగం కత్తిరించి గోడ మీద మేకుకు తగిలించారంటే చెవి పోగులు, గాజులు, దారబ్బంతులు, గుండీలు, పెన్నులు, కత్తెర్లు ఏవైనా పెట్టేయొచ్చు. ప్రయోజనం నెరవేరడమే కాదు, పారదర్శకంగా (ట్రాన్స్‌పరెంట్‌) ఉండి బయటకు కనిపిస్తూ ఉంటాయి.

* డబ్బు దాచుకునే మట్టి ముంతలు ఓల్డ్‌ ఫ్యాషనైపోయాయి. ప్లాస్టిక్‌ సీసాకు రంగు కాగితం అతికించో, పెయింటు వేసేసో రంధ్రం చేస్తే చాలు కిడ్డీ బ్యాంక్‌ లేదా పిగ్గీ బ్యాంక్‌ తయారైపోతుంది.

* బాల్కనీలోనే కాదు డ్రాయింగ్‌ రూంలో కూడా ప్లాస్టిక్‌ సీసాలను వేలాడదీసి ఇండోర్‌ ప్లాంట్స్‌ పెంచవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్