80 సెకన్లలో.. ఉతికేస్తుంది!

అవును.. మీరు విన్నది నిజమే! మార్కెట్లో వాషింగ్‌ మెషిన్లు ఎన్ని వచ్చినా.. అమ్మకు శ్రమ మాత్రం ఒక్కటే! సబ్బు, ద్రావణాలు, నీళ్లు.. అదనం.

Published : 04 Mar 2023 00:17 IST

అవును.. మీరు విన్నది నిజమే! మార్కెట్లో వాషింగ్‌ మెషిన్లు ఎన్ని వచ్చినా.. అమ్మకు శ్రమ మాత్రం ఒక్కటే! సబ్బు, ద్రావణాలు, నీళ్లు.. అదనం. అసలు ఇవేవీ లేకుండా వాటంతంట అవే శుభ్రమైపోతే ఎంత బావుండు? అలా అనుకునేవారికి 80 వాష్‌ అనే సరికొత్త పరికరం వరంగా మారనుంది. మామూలువి దుస్తులు వేసిన ప్రతిసారి గంట సమయం తీసుకుంటాయి. కానీ ఈ 80 వాష్‌ మెషిన్‌.. పేరుకు తగ్గట్టే.. 80 సెకన్లలోనే పని పూర్తిచేస్తుంది. కేవలం ఒక కప్పు నీటితో దుస్తులన్నింటినీ శుభ్రపరుస్తుంది. కార్యాలయానికో, శుభకార్యానికో వెళ్లాలనుకునే ఆడవాళ్లకు ఇది అత్యుత్తమ ఎంపిక. దీనివల్ల సమయం ఆదా. సబ్బు, నీటి ఖర్చు ఉండదు. స్టీమ్‌ టెక్నాలజీ ఆధారంగా పొడిఆవిరి, రేడియో ఫ్రీక్వెన్సీ సాయంతో పనిచేస్తుంది. మొండి మరకలుంటే 5, 6 గ్లాసుల నీరు అవసరమవుతాయి. ఈ మెషిన్‌ పంజాబ్‌ విద్యార్థులు రూపొందించారు. త్వరలోనే అందుబాటులోకి రానుంది. భలేగుంది కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్