రంగుల పండుగకి సిద్ధమేనా..?

రంగేలి హోలి... హంగామా ఖేలి సరే... రక్షణ సంగతేంటి... మార్కెట్‌లో దొరికే రంగుల్ని నమ్మి సమస్యలు తెచ్చుకుందామా? కాస్త సమయం కేటాయిస్తే... ఎలాంటి చింతా లేకుండా పండుగ చేసుకోవచ్చు.

Published : 05 Mar 2023 00:07 IST

రంగేలి హోలి... హంగామా ఖేలి సరే... రక్షణ సంగతేంటి... మార్కెట్‌లో దొరికే రంగుల్ని నమ్మి సమస్యలు తెచ్చుకుందామా? కాస్త సమయం కేటాయిస్తే... ఎలాంటి చింతా లేకుండా పండుగ చేసుకోవచ్చు.

మయం దేనికి అంటారా... అదేనండి రంగులు తయారు చేసుకోడానికి... వంటింట్లో దొరికే సామాగ్రితో సేంద్రియ రంగులను సులువుగా తయారు చేసుకోవచ్చు... ఎలానో చూసేయండి మరి...

గులాబీ... బీట్‌రూట్‌ను గ్రైండ్‌ చేసుకుని రసం తీసుకోవాలి. మొక్కజొన్న పిండిలో రసాన్ని కలిపితే గులాబీ రంగు రెడీ. బీట్‌రూట్‌కి బదులుగా గులాబీ, మందార పువ్వులు కూడా వాడొచ్చు.

ముదురు గులాబీ... బీట్‌రూట్‌ను, గులాబీ రెక్కలను ఉడకబెట్టి రాత్రంతా నిల్వ ఉంచాలి. పొద్దున దాన్ని పిండిలో కలిపితే ముదురు గులాబీ రంగు వస్తుంది.

పచ్చ... పాలకూరను మెత్తగా గ్రైండ్‌ చేసుకుని రసం తీసుకుని... దాన్ని మొక్కజొన్న పిండికి కలిపితే సరి.

నారింజ... కాస్త ఆరెంజ్‌ రంగు ఫుడ్‌కలర్‌ని నీటిలో కలిపి... దాన్ని పిండిలో కలిపితే నారింజ రంగు తయారైపోతుంది. క్యారెట్‌నూ దీని తయారీకి వాడొచ్చు.

నీలం... రెడ్‌ క్యాబేజీ... సూపర్‌ మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని  గ్రైండ్‌చేసి... పిండిలో కలిపితే నీలం రంగు ఇట్టే వచ్చేస్తుంది.

పసుపు... పసుపు లేని వంటిళ్లు ఉంటుందా... నీళ్లలో పసుపు కలిపి దాన్ని పిండిలో వేస్తే సరి. శెనగ పిండిని కూడా వాడొచ్చు. బంతి పూలనూ వాడి రంగును చేయొచ్చు.

ఇలా తయారు చేసినవి రెండు, మూడు రోజులు ఎండలో పెడితే... అదిరిపోయే సేంద్రియ రంగులు తయారైపోతాయి. సువాసన కోసం కాస్త టాల్కం పౌడర్‌ని కలపొచ్చు. మొక్కజొన్న పిండే కాకుండా గోధుమ, ఆరోరూట్‌ పిండ్లునూ రంగుల తయారీకి వాడొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్