ఫర్నీచర్‌ కొనాలనుకుంటే...

ముందుగదిలో ఇంటిల్లిపాది కూర్చొని సరదాగా గడిపే సమయాన్ని మరింత ఆహ్లాదంగా మార్చుకోవాలి.  అందరూ కలిసి కూర్చోవడానికి సోఫా తప్పనిసరి అనిపిస్తుంది. ఇటువంటప్పుడు గది కి తగ్గట్లుగా బడ్జెట్‌ మించకుండా ఎంపిక చేయాలి. ఇంట్లో చిన్నారులున్నప్పుడు కేన్‌ సోఫా ఎక్కువరోజులు మన్నకపోవచ్చు. చెక్కతో కుషన్‌ ఉన్నవి మంచిది.

Updated : 13 Mar 2023 02:51 IST

ఇంటీరియర్‌

ఇంటి అందాన్ని రెట్టింపు చేసే ఫర్నీచర్‌ కొనాలన్నప్పుడు ఇంటికి తగ్గట్లుగా, అవసరానికి ఉపయోగపడేలా ఉండాలి.  

ముందుగదిలో ఇంటిల్లిపాది కూర్చొని సరదాగా గడిపే సమయాన్ని మరింత ఆహ్లాదంగా మార్చుకోవాలి.  అందరూ కలిసి కూర్చోవడానికి సోఫా తప్పనిసరి అనిపిస్తుంది. ఇటువంటప్పుడు గది కి తగ్గట్లుగా బడ్జెట్‌ మించకుండా ఎంపిక చేయాలి. ఇంట్లో చిన్నారులున్నప్పుడు కేన్‌ సోఫా ఎక్కువరోజులు మన్నకపోవచ్చు. చెక్కతో కుషన్‌ ఉన్నవి మంచిది. నాలుగైదేళ్ల తర్వాత మార్చే ఆలోచన ఉంటే మాత్రం పూర్తి కుషన్‌ సౌకర్యంతో వస్తున్న మోడల్‌ ఎంచుకోవచ్చు. గది గోడలు, కర్టెన్లకు సరిపోయే వర్ణంలో కుషన్ల కవర్లు తీసుకోవాలి. పిల్లలున్నప్పుడు లేతవర్ణాలకన్నా ముదురువాటి ఎంపిక మంచిది.

భోజనాల బల్ల..

రాత్రి భోజనం అంతా కలిసి చేసే అలవాటున్న కుటుంబాలకు భోజనాల బల్ల తప్పనిసరి. వంటగదికి సమీపంలో, ఫ్యాన్‌గాలి తగిలేచోట టేబుల్‌కు స్థలాన్ని ఎంచుకోవాలి. గది పరిమాణం, ఇంట్లో ఉన్నవారి సంఖ్యను బట్టి డైనింగ్‌ టేబుల్‌ ఎంపిక ఉండాలి. ఎంచుకున్న ప్రాంతంలో కోడిగుడ్డు, గుండ్రని, చతురస్ర, దీర్ఘచతురస్రాకారంలో ఏది సరిపోతుందో గుర్తించాలి. చెక్కపై స్టోన్‌ లేదా గ్లాస్‌ టాప్‌తో, మెటల్‌ ఎంబ్లిష్‌మెంట్‌తోనూ ఇప్పుడు భోజన బల్లలు లభ్యమవుతున్నాయి.  సింపుల్‌ లేదా వర్క్‌ ఉన్న కుర్చీలు, వాటిలో కుషన్స్‌కూ ప్రాధాన్యతనివ్వాలి.

డ్రెస్సింగ్‌ టేబుల్‌..

ఇంట్లో ప్రతి ఒక్కరికి అవసరమయ్యే అద్దం ఏర్పాటు అందరికీ అందుబాటులో ఉండాలి. దీనికి తగినట్లుగా డ్రెస్సింగ్‌ టేబుల్‌ను ఎంపిక చేయాలి. లార్జ్‌ లేదా స్మాల్‌ తరహాలో అద్దం ఉండి, గోడలో ఫిక్స్‌ చేసేది సొంత ఇంటికైతే సరిపోతుంది. అద్దె ఇంట్లో ఉన్నవారికి ఏ గదిలోనైనా సర్దుకొనేలా ఇప్పుడు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. అలాగే దీనికి ఇరువైపులా లేదా కింద సొరుగులుండే సౌకర్యం ఉంటే మంచిది. కాస్మొటిక్స్‌వంటివి సర్దేయొచ్చు. అలాగే పిల్లల గదిలో పుస్తకాల అలమర సౌకర్యాన్ని అందిస్తే మంచిది. వారికి సరైన ఎత్తులో ఉండేలా ఎంపిక చేస్తే పిల్లలకు పుస్తకాలన్నీ ఒకచోట సర్దుకొనే అలవాటు వస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్