ఇంటినలా మార్చేద్దాం!

కొన్ని ఇళ్లను చూడగానే ఇట్టే ఆకట్టుకునేలా ఉంటాయి. హంగులూ ఆర్భాటాలూ లేకపోయినా మనసుని హత్తుకుంటాయి. అలా మనమూ ఇంటిని మార్చుకోవచ్చు. కొన్ని మార్పులు చేయాలంతే!  విద్యుద్దీపాల ఎంపికలో... రంగు రంగుల దీపాలు ప్రశాంతతనీయవు. ఎబ్బెట్టుగానూ ఉంటాయి.

Published : 23 Mar 2023 00:10 IST

కొన్ని ఇళ్లను చూడగానే ఇట్టే ఆకట్టుకునేలా ఉంటాయి. హంగులూ ఆర్భాటాలూ లేకపోయినా మనసుని హత్తుకుంటాయి. అలా మనమూ ఇంటిని మార్చుకోవచ్చు. కొన్ని మార్పులు చేయాలంతే!

విద్యుద్దీపాల ఎంపికలో... రంగు రంగుల దీపాలు ప్రశాంతతనీయవు. ఎబ్బెట్టుగానూ ఉంటాయి. సాధ్యమైనంత వరకూ సహజకాంతి ఇంట్లో ప్రసరించేలా చూసుకోవాలి. దానివల్ల గదిలో వెలుతురు పడి ఆకర్షణీయంగా ఉంటుంది. సూర్యకాంతిని ప్రతిబింబించే అద్దాలు, పాలిష్డ్‌ లోహాలు గదిలో ఉంచాలి.  

పచ్చదనంతో.. ఇల్లు చిన్నదైనా పెద్దదైనా మొక్కలు పెంచుకోవటానికి స్థలం కేటాయించాలి. ప్రస్తుతం బయోఫిలిక్‌ డిజైన్‌కు మంచి ఆదరణ ఉంది. ఇంట్లో బోన్సాయి, సక్యులెంట్లు, పొడవాటి మొక్కలు పెంచితే మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి.

తక్కువతో ఎక్కువ అందం... ఇల్లంతా గృహోపకరణాలతో నింపేయాలన్నది పాత పద్ధతి. ఎంత తక్కువ వస్తువులు ఉంటే అంత అందమన్నది ఇప్పటి ఫ్యాషన్‌. మినిమలిజం అనేది విలాసవంతులకు ఒక స్టైల్‌లా కాక జీవన విధానంగా మారింది. ఎక్కువ వస్తువులు లేకుండా ఉంటే ఇళ్లంతా ప్రశాంతంగా ఉంటుంది.

సహజ ఉత్పత్తులే కీలకం.. మన దేశంలో సహజ సిద్ధంగా తయారయ్యే వస్తువులకు కొదవే లేదు. చేనేత వస్తువులు, కళాఖండాలు ఇంట్లో ఉపయోగించాలి. అప్పుడే భవిష్యత్‌ తరాలకూ ఒక సందేశాన్ని అందించిన వారమవుతాం.

హస్తకళల్ని వాడటం.. చేతితో తయారు చేసే ఆభరణాలు, కళాఖండాలు, దుస్తులు, వంటి వాటిని ఎంచుకోవాలి. ఇలాంటివి ఇంట్లో ఉంటే ఆ కళే వేరు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్