వంటగది.. పర్యావరణ హితంగా

అన్నింట్లోనూ సహజత్వాన్ని కోరుకునే మనం వంటగదిని కూడా ఎకోఫ్రెండ్లీగా తీర్చిదిద్దుదాం. కిచెన్‌ సామ్రాజ్యంలో అన్నింటినీ మనసుకు నచ్చిన విధంగా, ఆహ్లాదకరంగా మార్చేద్దాం..

Published : 02 Apr 2023 00:26 IST

అన్నింట్లోనూ సహజత్వాన్ని కోరుకునే మనం వంటగదిని కూడా ఎకోఫ్రెండ్లీగా తీర్చిదిద్దుదాం. కిచెన్‌ సామ్రాజ్యంలో అన్నింటినీ మనసుకు నచ్చిన విధంగా, ఆహ్లాదకరంగా మార్చేద్దాం..

* సరకులను నిల్వచేసేందుకు ప్లాస్టిక్‌ డబ్బాలకు బదులుగా గాజు, పింగాణీ సీసాలను, స్టీలు పాత్రలను ఉపయోగించొచ్చు. చూడటానికి అందంగా ఉండడమే కాక ఆరోగ్యానికీ, పర్యావరణానికీ చేటుచేయవు.

* ప్లాస్టిక్‌ చాపింగ్‌ బోర్డులకు బదులుగా కూరగాయలు తరిగేందుకు చెక్కవి ఉపయోగిస్తే మేలు. వంట కోసం మట్టి పాత్రలను కూడా ప్రయత్నించొచ్చు.

* కూరగాయలను బయటినుంచి తెచ్చుకునేందుకు ఫ్రిజ్‌లో భద్రపరుచుకోడానికి కూడా రీ యూజబుల్‌ సంచులను వినియోగిస్తే సరి. ఇంట్లో పాలిథీన్‌ కవర్లు పేరుకోకుండా ఉంటాయి.

* కరెంటుతో పనిచేసే అవెన్లు, ఏసీలు, ఫ్రిజ్‌ల్లాంటి వస్తువుల్లో కరెంటు ఆదా చేసేవి ప్రత్యేకంగా ఎంపిక చేసి కొనండి. వంటగది వ్యర్థాలను పడేయటానికి బదులుగా కంపోస్ట్‌ తయారు చేస్తే సరి. దాన్ని గార్డెన్‌లో ఉపయోగిస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

* ఇంట్లో అక్కడక్కడా కుండీల్లో  మొక్కలు పెంచటం వల్ల లోపల ఉన్న కార్బన్‌డైఆక్సైడ్‌ ఆక్సిజన్‌గా మారుతుంది. స్వచ్ఛమైన గాలితో, పచ్చదనం కనిపిస్తుంటే ఇల్లు కూడా ఆహ్లాదంగా మారుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్