దుస్తులు కొంటున్నారా?
కంటికి నచ్చినవన్నీ కొంటే వార్డ్‌రోబ్ కిక్కిరిసిపోతుంది. అలాకాకుండా పర్యావరణ హితాన్ని కోరుకుంటూ ‘గ్రీన్ వార్డ్‌రోబ్’ ప్రయత్నిద్దామా?
కంటికి నచ్చినవన్నీ కొంటే వార్డ్‌రోబ్ కిక్కిరిసిపోతుంది. అలాకాకుండా పర్యావరణ హితాన్ని కోరుకుంటూ ‘గ్రీన్ వార్డ్‌రోబ్’ ప్రయత్నిద్దామా?
పర్యావరణహితంగా జీవించాలనే ఆశయం ఉన్నప్పుడు దుస్తుల ఎంపికలోనూ అది ప్రతిబింబించాలి. త్వరగా భూమిలో కలవని సింథటిక్, సిల్క్ వంటివి కాకుండా ఆర్గానిక్ కాటన్‌ను ఎంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగే కంటికి నచ్చిందల్లా కొనేయడం, ఆ తర్వాత వాటిని వృథాగా ఒక మూల పడేయడమూ సరికాదంటున్నారు. ప్రస్తుతం పలు సంస్థలు ఆర్గానిక్ ఫ్యాషన్‌కి ఎక్కువ ప్రాచుర్యం కల్పిస్తున్నాయి. సెలబ్రిటీల ఆహార్యాన్నీ ప్రత్యేకంగా ఈ పద్ధతిలో డిజైన్ చేస్తున్నాయి.
ముఖ్యంగా వేసవికాలంలో మృదువైన ఆర్గానిక్ కాటన్ ఎంపిక ఎంతో సౌకర్యం కూడా. వీటిల్లో చీరలు వంటి సంప్రదాయ వస్త్రశ్రేణి మాత్రమే కాదు...ఈతరం మెచ్చే క్రాప్ ప్యాంట్లు, టాపులూ, బ్రీజ్ డ్రెస్సులు వంటి డిజైన్లెన్నో మార్కెట్‌లోకి వస్తున్నాయి. వీటితో మీ అల్మారా గ్రీన్ వార్డ్‌రోబ్‌గానూ మారిపోతుంది.
పునర్వినియోగం.. జీన్స్, లెగ్గింగ్స్ వంటివి కొన్న కొత్తలో ఎక్కువగా ధరిస్తుండటం అందరికీ అలవాటు. ఆ తర్వాత అవన్నీ అల్మారా మూలల్లో కూరుకుపోయి, వాటి స్థానంలో కొత్తవి వస్తుంటాయి. అలాకాకుండా వీటినే రీ యూజ్, రీ సైకిల్ పద్ధతిలో వినియోగించగలిగితే వృథా ఉండదు. అప్పటివరకు ఫుల్ ప్యాంటుగా ఉన్న కాటన్ జీన్‌ను రెండు అంగుళాలు కట్ చేస్తే చాలు. కొత్త ట్రెండ్‌కు తగ్గట్టుగా మారిపోతుంది. అలాగే కొన్ని జీన్స్ ఎన్నిరోజులైనా చిరగవు. చూడటానికేమో పాతగా కనిపిస్తుంటాయి. వీటిపై ఎంబ్రాయిడరీ, ఆర్ట్‌వర్క్ వంటివి చేస్తే కొత్త దానిలా మెరిసిపోతుంది. తక్కువ దుస్తులతోనూ ఎలా మెరిపించొచ్చో సామాజిక మాధ్యమాల నుంచీ తెలుసుకోవచ్చు. అందుకు సాయపడే ఇన్‌ఫ్లుయెన్సర్లెందరో! అనుసరిస్తే సరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.