సహజంగా.. పరిమళాలు
ఇల్లంతా పరిమళాలు వెదజల్లాలని... రూమ్ స్ప్రేలు వాడుతుంటాం. కానీ రసాయనాలతో చేసినవి దీర్ఘకాలంలో అనారోగ్యాలు తెచ్చిపెడతాయి. ఈ పరిస్థితి తలెత్తొద్దంటే...
ఇల్లంతా పరిమళాలు వెదజల్లాలని... రూమ్ స్ప్రేలు వాడుతుంటాం. కానీ రసాయనాలతో చేసినవి దీర్ఘకాలంలో అనారోగ్యాలు తెచ్చిపెడతాయి. ఈ పరిస్థితి తలెత్తొద్దంటే...
* ఓ గిన్నెలోకి రెండొంతుల నీళ్లను తీసుకుని దానికి రెండు చుక్కల నిమ్మగడ్డి నూనెనూ కలిపి మరిగించండి. ఆ వాసనలు ఇల్లంతా వ్యాపించి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. దానిలో ముంచిన దూది ఉండల్ని గది మూలల్లో ఉంచితే దుర్వాసనల్ని పీల్చేసుకుంటాయి. దోమల్నీ అడ్డుకుంటాయి.
* ఖాళీ స్ప్రే బాటిల్లో సగం వరకూ నీళ్లను నింపి అందులో కాస్త బేకింగ్ సోడా, రెండు చుక్కల లావెండర్ నూనె కలిపి గాల్లోకి స్ప్రే చేయండి. ఆ పరిమళాలు మనసుని తేలికపరుస్తాయి.
* దుస్తులూ, రంగులూ, ఆహారపదార్థాల తాలూకు ఘాటైన వాసనలు ఒక్కోసారి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఇలాంటప్పుడు గుప్పెడు వామాకు దంచి రసం తీయండి. అందులో కాటన్ ఉండల్ని అద్ది....అక్కడక్కడా పెడితే సరి. మంచి వాసన రావడంతో పాటూ...ఒత్తిడీ దూరమవుతుంది.
* గుప్పెడు తులసి ఆకులు, కమలా, నిమ్మ పండ్ల తొక్కల్ని ఓ లీటరు నీటిలో వేసి మరిగించండి. కొద్దిగా అయ్యాక ఆ నీళ్లను కర్టెన్లు, గది మూలల్లో స్ప్రే చేయండి. రోజంతా ఆ పరిమళం ముక్కుని తాకుతూనే ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.