ఫర్నిచర్‌లోనూ పచ్చదనం..
మొక్కలు పెంచాలనే ఆసక్తితో బాల్కనీ, మిద్దెతోట, పెరటి తోట పెంపకాన్ని ఎంచుకునే వారెందరో. ఇండోర్ ప్లాంట్స్‌తో ఇంటినీ అలంకరిస్తున్నాం. ఇంకా కొత్త మార్గాల కోసం వెతుకుతున్నారా? ఫర్నిచర్‌తో కలిసిపోయేలా పచ్చదనాన్ని పెంచుకొనేలా ఇంటీరియర్ డిజైనర్లు రూపొందిస్తున్న వీటిని ప్రయత్నించేయండి.
మొక్కలు పెంచాలనే ఆసక్తితో బాల్కనీ, మిద్దెతోట, పెరటి తోట పెంపకాన్ని ఎంచుకునే వారెందరో. ఇండోర్ ప్లాంట్స్‌తో ఇంటినీ అలంకరిస్తున్నాం. ఇంకా కొత్త మార్గాల కోసం వెతుకుతున్నారా? ఫర్నిచర్‌తో కలిసిపోయేలా పచ్చదనాన్ని పెంచుకొనేలా ఇంటీరియర్ డిజైనర్లు రూపొందిస్తున్న వీటిని ప్రయత్నించేయండి.
భోజనబల్ల, టీపాయ్, కంప్యూటర్ టేబుల్‌వంటి ఫర్నిచర్‌కు కాళ్లు అమర్చే భాగాన్ని వినూత్నంగా డిజైన్ చేస్తున్నారు. అడుగుభాగాన తొట్టె సర్దే సౌకర్యాన్ని ఉంచుతున్నారు. అంతేకాదు, అందులో పెంచే ఇంటీరియర్ మొక్క అల్లుకోవడానికి వీలుగా ఉండేలా అందమైన ఆర్చిగా తీర్చిదిద్దుతున్నారు. పైకి టేబుల్‌గా కనిపిస్తూ.. కింది భాగమంతా పచ్చదనంతో నిండుగా ఉంటుంది. గదికి అందంగా, పర్యావరణానికి తగినట్లుగా టేబుల్ కొత్తగానూ అనిపిస్తుంది.
ల్యాంప్ కింద.. నైట్‌ల్యాంప్ కింద ఉంచే స్టాండుకు బదులుగా మొక్కలను పెంచే పద్ధతికి అనువుగా ఉండేలా బాటిల్ గార్డెన్ పద్ధతిలో సీసాను అమరుస్తున్నారు. ఇందులో మట్టి, రాళ్లు వంటివి సర్ది నీటిని నింపి ఇంటీరియర్ మొక్కలను పెంచొచ్చు. పైన లైటు వెలుతురు, కింద పచ్చదనంతో నిండి సీసా చూడముచ్చటగా ఉంటుంది. గదికి కొత్తందాన్నిస్తుంది.
టీపాయి కింద.. గాజుతో కవర్ చేసే టీపాయి స్టాండుకు, పైభాగానికి మధ్యలో తీగజాతి మొక్కలను పెంచొచ్చు. ఆ ప్రాంతంలో మట్టిని నింపి ఇంటీరియర్ మొక్కను ఉంచితే చాలు. అది కిందకు తీగలా అల్లుకుంటుంది. అద్దంలో నుంచి మొక్క కనిపిస్తూ టీపాయి మరింత అందంగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.