కప్పులో పూలు, బ్యాగులో మొక్కలు!
మొక్కలు పెంచాలన్న ఆసక్తి ఉండాలే కానీ... వృథాగా ఉన్న ప్రతి వస్తువులోనూ పచ్చదనాన్ని పెంచేయొచ్చు.
మొక్కలు పెంచాలన్న ఆసక్తి ఉండాలే కానీ... వృథాగా ఉన్న ప్రతి వస్తువులోనూ పచ్చదనాన్ని పెంచేయొచ్చు...
ప్రారంభంలోనే పెద్ద మొక్కలు పెంచేయాలనుకోకండి. చిన్న చిన్నవాటినే ఎంచుకోండి. ఇందుకోసం వృథాగా పడి ఉన్న డబ్బాలూ, ప్లాస్టిక్ సీసాలు పనికిరాని బకెట్లు వంటివేవైనా వాడొచ్చు. ముందుగా వీటిని శుభ్రంగా కడిగి... నచ్చిన పెయింటింగ్ వేసి ఆరనివ్వండి. అదనపు నీళ్లు పోవడానికి రెండు రంధ్రాలు కూడా చేయాలి. వాటిల్లో కోకోపీట్, ఎరువు, సారవంతమైన ఎర్రమట్టి నింపితే సరి. నచ్చిన మొక్కలు నాటుకోండి. డబ్బాలకు తాళ్లు కడితే పోర్టికోలోనో, పెద్ద చెట్ల కొమ్మలకో వేలాడదీయొచ్చు. వీటిల్లో లోతైన వేళ్లు లేని మొక్కలు అంటే గడ్డిగులాబీ, మరువం, డయాంతస్ వంటి వాటిని పెంచు కోవచ్చు. నిండుగా పూలు పూసి ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
* హ్యాండ్‌బ్యాగ్‌లు, బూట్లు, కాలేజీ బ్యాగ్‌లు, కుర్చీలు, పాత్రలు, టైర్లు, సైకిళ్లు వంటివాటినీ మొక్కల పెంపకానికి వాడొచ్చు. వీటిని నేరుగానూ, అవసరమైతే లోపల ప్లాస్టిక్ షీట్‌లు ఏర్పాటు చేసుకోవాలి. వీటిల్లో ఉండే సారవంతమైన మట్టి మిశ్రమాన్ని నింపి మెంతి, కొత్తిమీర, పాలకూర వంటి ఆకుకూరల్నీ పెంచుకోవచ్చు. ఇలా నిరుపయోగంగా ఉన్న ప్రతి వస్తువునీ అందమైన వనంగా మార్చేయొచ్చు. ప్రయత్నించి చూడండి మరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.